English   

రామ్ చ‌ర‌ణ్ కు లేని ధైర్యం నానికి ఎక్క‌డ్నుంచి వ‌చ్చింది..? 

Nani
2019-07-13 15:58:33

ఇప్పుడు అభిమానులు ఇదే అడుగుతున్నారు న్యాచుర‌ల్ స్టార్ నానిని. రామ్ చరణ్ కూడా పెట్టుకోవడానికి భయపడిన టైటిల్ ను ఇప్పుడు నాని పెట్టుకున్నాడు. దానికి ఫలితాన్ని ఇప్పుడు తనకు తెలియకుండానే అనుభవిస్తున్నాడు న్యాచురల్ స్టార్. విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో నటిస్తున్న సినిమాకు గ్యాంగ్ లీడర్ టైటిల్ పెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ టైటిల్ పెట్టినప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అయి ఉంటాడో త‌ర్వాత‌ ఆ టైటిల్ ఎంచుకున్నందుకు కచ్చితంగా బాధపడుతూ ఉంటాడు నాని. దానికి కారణం మెగా ఫ్యాన్స్. ఒకప్పుడు రామ్ చరణ్ సైతం గ్యాంగ్ లీడర్ సినిమా టైటిల్ ముట్టుకోవడానికి భయపడ్డాడు. రచ్చ సినిమా కు ముందు గ్యాంగ్ లీడర్ అనే టైటిల్ అనుకున్నారు. కానీ అది పెడితే అభిమానులు ఎలా రియాక్ట్ అవుతారో తెలియక సాక్షాత్తు చిరంజీవి తనయుడు సైతం ఈ టైటిల్ కు దూరంగా ఉన్నాడు.  ఇప్పుడు నాని ఈ టైటిల్ తోనే సినిమా చేస్తున్నాడు. మొద‌ట్లో ఫ్యాన్స్ కాస్త ర‌చ్చ చేసినా ఇప్పుడంతా సైలెంట్ అయిపోయారు. తాజాగా ఈ చిత్ర ప్రీ లుక్ కూడా విడుద‌లైంది. జులై 15న ఫ‌స్ట్ లుక్.. ఫ‌స్ట్ సాంగ్ 18.. టీజ‌ర్ 24న విడుద‌ల కానున్నాయ‌ని తెలిపారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. నాని అద్భుతమైన నటుడే కానీ చిరంజీవి రేంజ్ కాదు.. ఆయన టైటిల్ వాడుకునే సత్తా గాని అర్హత గాని దానికి లేవు అంటూ అభిమానులు మండిప‌డుతున్న స‌మ‌యంలో గ్యాంగ్ లీడ‌ర్ ప్రీ లుక్ కు మంచి రెస్పాన్స్ వ‌స్తుంది. క‌చ్చితంగా ఈ చిత్రంతో చిరంజీవి టైటిల్ ప‌రువు ఇంకా పెంచుతానంటున్నాడు ఈయ‌న‌. న‌లుగురు అమ్మాయిలు.. వాళ్ల గ్యాంగ్ కు లీడ‌ర్ నాని.. ఈ ఐదుగురు దొంగ‌లు.. ఇదే ఈ సినిమా క‌థ‌. మ‌రి దీన్ని విక్ర‌మ్ కే కుమార్ త‌న స్క్రీన్ ప్లేతో ఎలాంటి మ్యాజిక్ చేసుంటాడో చూడాలి. 

More Related Stories