కమెడియన్ పృధ్వీకి కీలక పదవినివ్వనున్న జగన్ !

ప్రముఖ కమెడియన్, నటుడు, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాద్యతలు నిర్వహిస్తున్న బలిరెడ్డి పృథ్వీ రాజ్ కి ఏపీ ప్రభుత్వం కీలక పదవిని అప్పగించబోతున్నట్లు తెలుస్తోంది. ఆయనను శ్రీవెంకటేశ్వర భక్తి ఛానల్ ఎస్వీబీసీ చైర్మన్ గా పృథ్వీని సీఎం జగన్ నియమించబోతున్నట్లు విశ్వసనీయవర్గాల నుండి అందుతున్న సమాచారం. ఇందుకు సంబంధించి త్వరలోనే ఉత్తర్వులు వెలువడతాయని చెబుతున్నారు. కాగా, టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు ఎస్వీబీసీ ఛానల్ చైర్మన్ గా వ్యవహరించారు. అయితే టీడీపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతో ఏడాదిన్నర తర్వాత తన పదవికి రాఘవేంద్రరావు రాజీనామా సమర్పించారు. కాకుంటే ఆయన వయోభారంతో రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. వైసీపీ స్టేట్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పార్టీకి సేవలు అందించిన ఆయన గత ఎన్నికల సమయంలో పార్టీ వాయిస్ గట్టిగా వినిపించారు. ఈయన కొన్ని రోజులు జగన్తో పాటు పాద యాత్రలో పాల్గొనటమే కాక పార్టీ తరుపున వివిధ ఛానల్స్ లో, సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవారు. ఈ పదవికి ఇండస్ట్రీ నుండి జీవిత, రాజశేఖర్, మోహన్ బాబు పేర్లు వినిపించగా చివరికి పృథ్వీకే ఎస్విబిసి చైర్మన్ పదవి దక్కింది.