English   

శ్రీహ‌రి కొడుకు హిట్టా ఫ‌ట్టా.. రాజ్ దూత్ ప‌రిస్థితేంటి..? 

 RajDooth
2019-07-13 16:26:43

రాజ్ దూత్.. ఈ సినిమా గురించి కూడా ప్రేక్ష‌కుల‌కు స‌రిగ్గా తెలియ‌దు. పెద్ద‌గా అంచ‌నాలు కానీ ఆస‌క్తి కానీ లేకుండానే విడుద‌లైంది ఈ చిత్రం. ఈ సినిమాతోనే శ్రీ‌హ‌రి న‌ట వార‌సుడు మేఘాంశ్ ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అయ్యాడు. తెలుగులో ఉన్న స్టార్ హీరోలు, ద‌ర్శ‌కులు అంతా ఈ చిత్రం కోసం ప్ర‌మోష‌న్ చేసారు. ఇక ఇప్పుడు సినిమా కూడా విడుద‌లైంది. మ‌రి ఇందులో శ్రీ‌హ‌రి కొడుకు ఎలా చేసాడు.. ఆయ‌న నిజంగానే హీరోగా ప‌నికొచ్చే మెటిరియ‌లా కాదా అని ఆరా తీస్తున్నారు. దీనికి సినిమా స‌మాధానం అయితే కాదు. ఎంద‌కుంటే అర్జున్ కార్తిక్ తెర‌కెక్కించిన రాజ్ దూత్ ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. కథ ఓ బైక్ చుట్టూ తిరగడం.. కథనంలో లాజిక్ మిస్ అవడంతో రాజ్ దూత్ ఫ్లాప్ అని డిసైడ్ చేసారు ప్రేక్ష‌కులు. కానీ మేఘాంశ్ మాత్రం న‌టుడిగా బాగానే ఆక‌ట్టుకున్నాడ‌ని తెలుస్తుంది. ఎలాగూ ఆయ‌న కొడుకు కాబ‌ట్టి ఆ ర‌క్తం ఉంటుంది.. అందుకే శ్రీహరి కొడుకు న‌టుడిగా ర‌ప్ఫాడించాడంటున్నారు అభిమానులు. ఈయ‌న‌కు మంచి సినిమా ప‌డితే క‌చ్చితంగా హీరోగా నిల‌బ‌డతాడ‌ని బ‌ల్ల‌గుద్ది మ‌రీ చెబుతున్నారు. డాన్సులు కాస్త త‌డ‌బ‌డినా.. యాక్ష‌న్ సీన్స్ బాగా చేసాడ‌ని పేరు తెచ్చుకున్నాడు. ఇక ఎమోష‌న‌ల్ సీన్స్ మాత్రం ఊహించినంత బాగా చేయ‌లేదు. మొత్తానికి న‌టుడిగా మంచి ఎంట్రీ ఇచ్చినా.. హీరోగా నిల‌బ‌డ్డానికి మాత్రం క‌చ్చితంగా బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఒక‌టి కావాలి. మ‌రి దానికి ఇంకెంత స‌మ‌యం ప‌డుతుందో చూడాలి. 

More Related Stories