దొరసానిలో దేవరకొండ బాబు ఎలా ఉన్నాడంటే..

ఇండస్ట్రీకి వారసులు పరిచయం కావడం ఇదేం తొలిసారి కాదు. ఇంకా మాట్లాడితే ఇక్కడున్న వాళ్లలో 90 శాతం వారసులే. ఇప్పుడు విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ కూడా వచ్చాడు. ఈయన నటించిన దొరసాని విడుదలైంది. టాక్ కూడా ఊహించినట్లుగా రాలేదు. పాత కాలం కథ కావడంతో పాటు మరీ రొటీన్ స్క్రీన్ ప్లే సినిమాకు మైనస్ అయిపోయింది. దానికి తోడు ఆనంద్ దేవరకొండ కూడా నటుడిగా ఎదగడానికి ఇంకా చాలా సమయం పడుతుందని చెబుతున్నారు ప్రేక్షకులు. ముఖ్యంగా ఎక్స్ ప్రెషన్స్ విషయంలో అసలు అన్నయ్య విజయ్ తో పోలిక కూడా లేదు ఈ తమ్ముడికి. ఎమోషనల్ సీన్స్ అయినా.. కామెడీ సీన్స్ అయినా.. రొమాంటిక్ సీన్స్ అయినా కూడా అన్నింటికీ ఒకే ఎక్స్ ప్రెషన్ ఇచ్చాడంటూ ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ మొదలైపోయాయి. కచ్చితంగా మరో రెండు మూడు సినిమాలు చేసిన తర్వాత కానీ ఆనంద్ దేవరకొండను నటుడిగా గుర్తించడం కష్టమే అంటున్నారు ఆడియన్స్. మరోవైపు శివాత్మిక మాత్రం తన చూపులతో పాటు నటనతో కూడా ఆకట్టుకుంది. మంచి సినిమా పడితే ఈమె గుర్తింపు తెచ్చుకోవడం ఖాయం. పైగా పేరెంట్స్ నుంచి ఆ నటన అలాగే తీసుకుంది శివాత్మిక. మొత్తానికి దొరసాని ఆనంద్ కు ఏమో కానీ శివాత్మికకు మాత్రం బాగానే పనికొచ్చేలా కనిపిస్తుంది.