English   

బిగ్ బాస్ మీద సెక్స్ ఆరోపణలు...మరొకరు కూడా ?

biggboss3
2019-07-13 21:18:16

తెలుగు బుల్లి తెర ప్రేక్షకులు ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూస్తున్న బిగ్ బాస్ షో దగ్గర పడింది.అయితే గత రెండు సీజన్లుగా ఈ షో మొదలయ్యాక వివాదాలు మొదలయితే ఈ షో మొదలు కాక మునుపే కొత్త వివాదాలు సీజన్ 3ని చుట్టేశాయి. ఇప్పటికే ఈ షో మీద యాంకర్ శ్వేతా రెడ్డి సంచలన ఆరోపణలు చేయగా, ఇప్పుడు ఆమె చేసిన ఆరోపణలు లాంటివే చేసింది ఫిదా ఫేమ్ గాయత్రి గుప్త. ఒకప్పుడు కాస్టింగ్ కౌచ్ ఉదంతం లో కూడా తనను చాలా మంది కమిట్మెంట్ అడిగారని ప్రకటించి రచ్చ రేపిన ఆమె ఇప్పుడు మరోసారి బిగ్ బాస్ విషయంలో సంచలన ఆరోపణ చేశారు. నిన్న టీవీ 5 లో యాంకర్ మూర్తి  నిర్వహించిన లైవ్ డిబేట్‌కి యాంకర్ శ్వేతారెడ్డితో కలిసి హాజరైన గాయత్రి గుప్త బిగ్ బాస్ నిర్వాహకులపై సంచలన ఆరోపణలు చేశారు. ఆడిషన్స్‌కి వెళ్లిన తనను 100 రోజుల పాటు సెక్స్‌కి దూరంగా ఉండాలంటే కష్టం కదా ? దానిని ఎలా మేనేజ్ చేస్తారని అడిగారని ఆమె పేర్కొంది. తమని వాళ్లు సెక్స్ టాయ్‌స్ అనుకుంటున్నారని గాయిత్రి గుప్త పేర్కొంది. అయితే బిగ్ బాస్‌ షో లో క్యాస్టింగ్ కౌచ్‌ ఉందని ఆడిషన్స్ పేరుతో కమిట్‌మెంట్స్ అడుగుతున్న వారి మీద హైదరాబాద్ పోలీస్ స్టేషన్‌లో యాంకర్ శ్వేతా రెడ్డి ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. బాస్‌ని ఎప్పుడూ సంతృప్తి పరచాలని తన బాడీ షేప్‌పై శ్యామ్ అనే కో ఆర్డినేటర్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని శ్వేతా రెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నట్టు సమాచారం. మరోపక్క బిగ్ బాస్ షో ముందు షోకి హైప్ తీసుకురావడం కోసమే ఈ ఆరోపణలు అని వీళ్లంతా బిగ్ బాస్ హౌస్ లో పాల్గొంటారని అంటున్నారు. చూడాలి మరి ఏమవుతుందో ?

More Related Stories