English   

బాలయ్యకి షాకిచ్చిన కోర్టు...పీఏకి మూడేళ్ళ శిక్ష

nbk
2019-07-14 09:05:58

ప్రముఖ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు షాక్ ఇచ్చింది ఏసీబీ కోర్టు. బాలకృష్ణ వద్ద పీఏ గా పని చేసిన శేఖర్‌కు కోర్టు జైలు శిక్ష, మూడు లక్షల జరిమానా విధించింది నెల్లూరు ఏసీబీ కోర్టు. ఆయన మీద నమోదయిన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆరోపణలు రుజువయ్యాయి. దీంతో శేఖర్‌కు కోర్టు మూడేళ్లు జైలు శిక్షతోపాటు రూ.3లక్షలు జరిమానా విధించింది. బాలయ్య పీఏ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దోషిగా తేలడం ఇటు సినీ ఇండస్ట్రీ, అటు రాజకీయ వర్గాల్లో చర్చానీయాంశమైంది. తిరుపతి పద్మావతి యూనివర్సిటీలో అసిస్టంట్ ఇంజినీర్ గా పనిచేస్తున్న శేఖర్ తనకున్న పరిచయాలతో బాలకృష్ణకు దగ్గరయ్యి ఆయన ఎమ్మెల్యే అయ్యాక ప్రభుత్వం తరపున పీఏ అయ్యారు. బాలయ్య సినిమాల్లో బిజీగా ఉండి నియోజకవర్గ బాధ్యతలు శేఖర్ కే అప్పగించారు బాలయ్య. దీంతో ఈయన ఎమ్మెల్యే పేరు చెప్పి అక్రమ వసూళ్లకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో హిందూపురానికి చెందిన టీడీపీ శ్రేణులు సైతం శేఖర్‌ను పీఏగా తొలగించాలని బాలకృష్ణను కోరారు. ఈ మేరకు ఆందోళనలను కూడా చేశారు. విషయం చంద్రబాబు వరకు వెళ్లడంతో అప్పట్లో శేఖర్‌ను తన పీఏ పోస్టు నుంచి బాలకృష్ణ తొలగించారు. ఇప్పుడు ఏసీబీ కోర్టు ఇలా షాకిచ్చింది మరి.

More Related Stories