English   

క్రిటిక్స్ కి సలహా ఇస్తున్న బుల్లి దేవరకొండ

anand
2019-07-14 09:32:37

ఆనంద్ దేవరకొండ - శివాత్మిక హీరి హీరోయిన్స్ గా మొన్న శుక్రవారం రిలీజయిన సినిమా దొరసాని. విడుదలైన తొలి రోజున మొదటి అట నుండే ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో నిన్న ఈ సినిమా టీమ్ సక్సెస్ మీట్ ను నిర్వహించింది. ఈ క్రమంలో మొదటి సినిమాకే రాటుదేలినట్టు క్రిటిక్స్ మీద కామెంట్స్ చేసాడు బుల్లి దేవరకొండ. ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ దొరసాని సినిమాకి వస్తోన్న రెస్పాన్స్ ఎంతో ఆనందాన్ని కలిగిస్తోందని, అనుకున్నట్టుగానే ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ రావడం సంతోషంగా ఉందని చెప్పుకొచ్చాడు. ఈ సినిమా చూసిన వాళ్లంతా 'దొరసాని' పాత్రలో శివాత్మిక, రాజు పాత్రలో నేను బాగా చేశామంటున్నారని కానీ రివ్యూయర్స్ మాత్ర్రం  నచ్చలేదని అంటున్నారని అన్నాడు. నన్ను విజయ దేవరకొండ తమ్ముడిలా చూడటం వల్లే వారికి నచ్చడం లేదని ఆయన చెప్పుకొచ్చాడు. నన్ను మా అన్నతో కంపేర్ చేసి రివ్యూలు అలా రాస్తున్నారని అనుకుంటున్నానని ఆయన చెప్పుకొచ్చాడు. మా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ వదిలేసి సినిమాని సినిమాలా చూస్తే అందరూ ఎంజాయ్ చేస్తారని అంటున్నాడు ఆనంద్ దేవరకొండ.

More Related Stories