English   

హిట్ కొట్టిన దర్శకుడికి ఛాన్స్ ఇచ్చిన నాని ?

nani
2019-07-14 10:06:19

నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం గ్యాంగ్ లీడర్. విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో వస్తోన్న ఈ సినిమా ప్రీ లుక్ రిలీజ్ కాగా ఆగష్టు నెలాఖరున ఈ సినిమా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే జెర్సీ హిట్ తో ఫాంలో ఉన్న నాని ఈ సినిమాని కూస హిట్ కొట్టి మార్కెట్ పదిలం చేసుకోవాలని చూస్తున్నాడు. అయితే ఈ సినిమా కాకుండా ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్షన్ లో సుధీర్ బాబుతో కలిసి వీ అనే సినిమా చేస్తున్నాడు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో నాని కంటే సుధీర్ బాబుకు ఎక్కువ స్క్రీన్ టైం ఉంటుందని, ఒకరకంగా ఇది సుధీర్ బాబు సినిమానే అని అందులో నానికి స్పెషల్ రోల్ లా ఉంటుందని చెబుతున్నారు. అయితే ఇక తర్వాత సినిమా ఒప్పుకునే పనిలో పడ్డాడట నాని. అయితే ఫిలిం నగర్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం నాని ఈ మధ్యనే 'ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ' అనే తక్కువ బడ్జెట్ సినిమా తీసి హిట్ కొట్టడమే కాక బడ్జెట్ కంటే మూడింతల కలెక్షన్లు సాధించిన ఆ చిత్ర దర్శకుడు స్వరూప్‌ ని ప్రత్యేకంగా పిలిచి ఏదైనా సూపర్ స్టోరీ ఉంటే స్క్రిప్ట్ సిద్ధం చేయమని చెప్పాడట. దీంతో స్వరూప్ ఆ పనిలో నిమగ్నం అయినట్టు చెబుతున్నారు. చూడాలి ఈ కధ ఓకే అయ్యి పట్టాలు ఎక్కుతుందో ? లేదో ?

More Related Stories