English   

పోసాని ఆరోగ్యం మీద క్లారిటీ...స్వయంగా వీడియో రిలీజ్

posani
2019-07-14 11:42:57

నటుడు, రచయిత పోసాని కృష్ణ మురళి ఆరోగ్యంపై రెండ్రోజుల నుండి సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతోంది. ఆయన ఆరోగ్యం బాలేదని ఆయన పరిస్థితి విషయమంగా ఉందని ప్రచారం జరిగింది. అయితే ఈ విషయం మీద తాజాగా క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు ఒక వీడియో రిలీజ్ చేశారు ఆయన. ఈ మధ్య తాను అనారోగ్యానికి గురైన మాట వాస్తవమే అని చెప్పారు ఆయన. అయితే తాను చికిత్స తరువాత కోలుకుంటున్నట్టుగా వివరించారు. మరోసారి తీవ్ర అస్వస్థతకు గురైనట్టుగా వస్తున్న వార్తలు అవాస్తవమని కొట్టిపారేశారు. యశోదా ఆసుపత్రిలో రావు అనే డాక్టర్ ఆధ్వర్యంలో తాను వైద్యం చేయించుకున్నానని ఇప్పుడు అంతా సెట్ అయ్యిందని. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నానని ఆయన తెలిపారు. మరో వారం పదిరోజుల్లో షూటింగ్‌లకు హాజరయ్యేందుకు సిద్ధమవుతున్నట్టుగా తెలిపారు. తన ఆరోగ్యం కుదుటపడాలని ప్రార్ధించిన వారందరికీ ఈ వీడియో ద్వారా కృతజ్ఞతలు తెలియజేశారు.  

 

More Related Stories