రవితేజ క్రిమినల్ అవుతున్నాడు.. సంచలన దర్శకుడితో మాస్ రాజా..

రవితేజ ఇప్పుడు వరస సినిమాలు చేస్తూ బిజీ అయిపోయాడు. ఆ మధ్య కాస్త గ్యాప్ తీసుకున్నా కూడా ఇప్పుడు మళ్లీ ఆ గ్యాప్ ఫిల్ చేస్తున్నాడు. ఇప్పటికే ఈయన విఐ ఆనంద్ దర్శకత్వంలో డిస్కో రాజా సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం ఇదే ఏడాది విడుదల కానుందని తెలుస్తుంది. ఈ సినిమాతో మరో రెండు మూడు కథలు విన్న ఈయన ఇప్పుడు సంచలన దర్శకుడితో సినిమాకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. ఆయనే అజయ్ భూపతి.. కేరాఫ్ ఆర్ఎక్స్ 100. గతేడాది చిన్న సినిమాతో ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన ఈయన ఇప్పుడు మాస్ రాజాతో సినిమాకు సిద్ధం అవుతున్నాడు. ఇందులో రవితేజ క్రిమినల్ గా నటించబోతున్నాడు. జెమిని కిరణ్ నిర్మించబోయే ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్ నుంచి మొదలు కానుంది. వీలైనంత త్వరగా సినిమా షూటింగ్ పూర్తి చేసి వచ్చే ఏడాది మొదట్లో విడుదల చేయాలని చూస్తున్నారు. ఇందులో హీరోయిన్ ఎవరు అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. త్వరలోనే దీనిపై అఫీషియల్ కన్ఫర్మేషన్ రానుంది. ఈ సినిమా కోసమే రవితేజ మరింత ఫిట్ గా మారుతున్నాడు. మొన్నీమధ్యే ఈయన జిమ్ చేస్తున్న ఫోటోలు కూడా బాగా వైరల్ అయ్యాయి. మరి క్రిమినల్ పాత్రలో మాస్ రాజా ఎలా ఉండబోతున్నాడో చూడాలి.