శర్వానంద్ సినిమా వాయిదా ?

యువ డైరెక్టర్ సుధీర్‌వర్మ దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా నటించిన తాజా చిత్రం రణరంగం. కాజల్, కల్యాణి ప్రియదర్శన్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా షూట్ ఇప్పటికే పూర్తి కాగా త్వరలోనే రిలీజ్ కి ప్లాన్ చేశారు. అయితే ముందు ప్రకటించిన దాని ప్రకారం అయితే ఆగస్టు 2న ఈ సినిమాను విడుదల చేయాలి. అయితే, ప్రస్తుతం ఈ సినిమా విడుదల వాయిదా పడక తప్పదు అని అంటున్నారు. ఎందుకు ఏమిటి అనే విషయాల మీద క్లారిటీ లేకున్నా సినిమా మాత్రం వాయిదా పడి సెప్టెంబరు రెండో వారంలో రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ విషయం మీద యూనిట్ నుండి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఎక్కడో ఒక టౌన్ లోని రౌడీ ఒక మాఫియా లీడర్‌గా మారాడన్న కథతో ఈ చిత్రం తెరకెక్కినట్లు తెలుస్తోంది. ఇప్పటికే విడుదల చేసిన టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద సూర్య దేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఇటీవల గాయపడిన శర్వా ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ సినిమా కాక ఆయన శ్రీకరం అలాగే 96 సినిమా రీమేక్ లో నటిస్తున్నారు.