శర్వానంద్ కోసం కొత్త భామ ?

రణరంగం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న హీరో శర్వానంద్ ఈ మధ్యనే ఒక సినిమా మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. కిశోర్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాకు ‘శ్రీకారం’ అనే టైటిల్‌ను ఖరారు కూడా చేశారు. రెండు వారాల క్రితమే ఈ సినిమా ప్రారంభోత్సవం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సినిమాకి కథ, స్క్రీన్‌ప్లేను కిశోర్ రెడ్డి అందించగా సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్ రాస్తున్నారు. మిక్కి జె.మేయర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి యువరాజ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఆగస్ట్ మొదటి వారం నుండి రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లనున్న ఈ సినిమాకి రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ఈ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు. అయితే సినిమా ప్రారంభోత్సవం నాటికి ఇంకా హీరోయిన్లను ఖరారు చేయలేదు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారట. అందులో రెండో హీరోయిన్ గా రూపా హెగ్డే అనే కొత్త హీరోయిన్ ని తీసుకున్నట్టు చెబుతున్నారు. కన్నడ భామ అయిన ఈమెని సినిమాలో తీసుకున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. మరో హీరోయిన్ కూడా ఫైనల్ అయ్యాక ఒకే సారి వీరి గురించి అధికారిక ప్రకటన ఇవ్వనున్నారు.