English   

శ్వేతారెడ్డి దారిలో గాయ‌త్రి గుప్తా.. బిగ్ బాస్ పై కాంట్ర‌వ‌ర్సీ ఎందుకు..?

Gayathri Gupta
2019-07-15 09:38:20

బిగ్ బాస్ తొలి రెండు సీజ‌న్స్ చాలా ప‌ద్ద‌తిగా సాగిపోయాయి. ఒక్క చిన్న కాంట్రవ‌ర్సీ కూడా లేకుండా అయిపోయాయి. కానీ మూడో సీజ‌న్ మాత్రం చాలా వివాదాల‌కు తావిస్తుంది. ఇదివర‌కు బ‌య‌టికి రాలేదా.. లేదంటే ఇప్పుడు బ‌య‌టికి వ‌స్తున్నాయా తెలియ‌డం లేదు కానీ మూడో సీజ‌న్ మాత్రం మొద‌లు కాక‌ముందే చాలా కాంట్ర‌వ‌ర్సీల‌కు పాయింట్ అవుతుంది. ఇప్పుడు కూడా గాయ‌త్రి గుప్తా మ‌రో సంచ‌ల‌నానికి తెర‌తీసింది. త‌న‌ను బిగ్ బాస్ లోకి తీసుకుని.. అగ్రిమెంట్ కూడా చేసుకున్న త‌ర్వాత ఇప్పుడు కుద‌ర‌దు పొమ్మ‌న్నార‌ని రాయ‌దుర్గం పోలీస్ స్టేష‌న్ లో ఫిర్యాదు చేసింది. త‌న‌తో బిగ్ బాస్ కో ఆర్డినేట‌ర్స్ ముగ్గురు మాట్లాడ‌ర‌ని.. ఆ త‌ర్వాత అగ్రిమెంట్ చేసుకున్నార‌ని.. కానీ కొన్ని రోజుల త‌ర్వాత మీరు బిగ్ బాస్ లో లేరు అంటూ చెప్పుకొచ్చార‌ని చెప్పింది గాయ‌త్రి. మీరు బిగ్ బాస్ ను ఎలా సంతృప్తి ప‌రుస్తార‌ని అస‌భ్యంగా మాట్లాడార‌ని చెబుతుంది గాయ‌త్రి. కొన్ని రోజుల కింద యాంక‌ర్ శ్వేతారెడ్డి కూడా ఇదే చేసింది. త‌న‌ను బిగ్ బాస్ లోకి ఆహ్వానించి ఆ త‌ర్వాత క‌మిట్మెంట్ అడిగార‌ని చెప్పింది ఈ భామ‌. ఇక ఇప్పుడు సేమ్ టూ సేమ్ గాయ‌త్రి కూడా ఇదే చెబుతుంది. అయితే ఇదంతా న‌మ్మ‌డానికి లేద‌ని.. కావాల‌నే కాంట్ర‌వ‌ర్సీ చేసి చీప్ ట్రిక్స్ ప్లే చేసి పాపుల‌ర్ కావాల‌ని చేస్తున్నారంటూ వాళ్ల‌పైనే కౌంట‌ర్స్ పేలుతున్నాయి. మొద‌టి రెండు సీజ‌న్స్ ఏ మాత్రం సంద‌డి లేకుండా జ‌రిగిపోయాయి. కానీ ఇప్పుడు మూడోసారి మాత్ర‌మే కావాల‌ని ఇలా షో ప‌రువు తీస్తున్నారంటూ ప్రేక్ష‌కులు కూడా మండిప‌డుతున్నారు. మ‌రి ఇందులో ఎన్ని నిజాలు ఉన్నాయో.. నిజంగానే హౌజ్ కు వెళ్లాలంటే కమిట్మెంట్ ఇవ్వాల్సి ఉందా అనేది మ‌రికొన్ని రోజులు ఆగితే తెలిసిపోతుంది. బిగ్ బాస్ 3 మాత్రం జులై 21 నుంచి మొద‌లు కానుంది. 

More Related Stories