English   

క‌ళ్యాణ్ రామ్ జోరు పెంచాడు.. ఎన్ని సినిమాలు చేస్తున్నాడో తెలుసా..?

Kalyan Ram
2019-07-15 09:57:41

ఇండ‌స్ట్రీలో ఏం చేసినా.. ఏం చేయాల‌న్నా ముందు కావాల్సింది విజ‌యం. హిట్టుంటే నువ్వే తోపు.. లేదంటే అంతే. ఇప్పుడు క‌ళ్యాణ్ రామ్ కూడా ఈ విజ‌యం కోస‌మే చూస్తున్నాడు. అదేం విచిత్ర‌మో కానీ.. పుష్క‌రం దాటితే కానీ క‌ళ్యాణ్ రామ్ కు స‌రైన విజ‌యం రాలేదు. అత‌నొక్క‌డే త‌ర్వాత ఎన్నో ఫ్లాపులు తిని ప‌టాస్ తో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్నాడు క‌ళ్యాణ్. మ‌ళ్లీ ఇప్ప‌టి వ‌ర‌కు హిట్ లేదు. షేర్.. యిజం.. నా నువ్వే.. ఎమ్మెల్యే లాంటి సినిమాలు ఇలా వ‌చ్చి అలా వెళ్లిపోయాయి. మొన్నొచ్చిన 118 కూడా ఏదో ప‌ర్లేద‌నిపించింది కానీ క‌ళ్యాణ్ రామ్ కోరుకున్న విజ‌యం మాత్రం కాదు. దాంతో ఇప్పుడు ఎలాగైనా హిట్ కొట్టాల‌నే క‌సితో ఉన్నాడు ఈ హీరో. దానికోసం ఎంత సాహ‌సం చేయ‌డానికైనా సిద్ధ‌మే అంటున్నాడు. ప్ర‌స్తుతం ఈయ‌న వ‌ర‌స సినిమాలు చేస్తున్నాడు. ఇప్ప‌టికే స‌తీష్ వేగేశ్న ద‌ర్శ‌క‌త్వంలో ఎంత మంచివాడ‌వురా సినిమా చేస్తున్నాడు క‌ళ్యాణ్. ఈ చిత్రంతో పాటు వేణు మ‌ల్లిడి ద‌ర్శక‌త్వంలో తుగ్ల‌క్ సినిమా కూడా చేస్తున్నాడు. ఈ రెండూ ఇలా ఉండ‌గానే సంప‌త్ నంది ద‌ర్శ‌క‌త్వంలో కూడా ఓ సినిమా చేయ‌బోతున్నాడ‌ని తెలుస్తుంది. ర‌చ్చ త‌ర్వాత ఇప్ప‌టి వ‌ర‌కు ఈయ‌న‌కు స‌రైన విజ‌యం రాలేదు. మ‌రి ఇన్ని సినిమాలు చేస్తున్నాడు.. క‌నీసం ఇప్పుడైనా ఆ హిట్ కొట్టి చూపిస్తాడో లేదో..? 

More Related Stories