అమలా పాల్ మళ్లీ ప్రేమలో పడిందా.. మరి పెళ్లెప్పుడు..?

ఇండస్ట్రీలో ఉన్న వాళ్లకు ప్రేమలు, పెళ్లిళ్లు కొత్త కాదు. వాళ్లకు నచ్చినపుడు కలిసి ఉంటారు.. నచ్చకపోతే విడిపోతారు. ఎవరో అక్కడక్కడ కొన్ని జంటలు మాత్రమే ఎప్పుడూ కలిసే ఉంటారు. కానీ చాలా మంది మాత్రం ఎవరికి వారే అన్నట్లుంటారు. ఇందులో అమలాపాల్ కూడా ఒకరు. ఈ ముద్దుగుమ్మ నాలుగేళ్ల కింద తను ప్రేమించిన ఏఎల్ విజయ్ ను పెళ్లి చేసుకుంది. ఆ దర్శకుడితో వరస సినిమాలు చేసి చివరికి ఆయన్నే పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైపోయింది అమలా. అయితే పట్టుమని రెండేళ్లు కూడా కాపురం చేయకుండానే విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత మళ్లీ విజయ్ సినిమాలతో బిజీ అయిపోయాడు. అమలాపాల్ కూడా నటనతో బిజీ అయిపోయింది. ఈ మధ్యే మళ్లీ ఈయన రెండో పెళ్లి చేసుకున్నాడు. దీనిపై ఏం మాట్లాడటం లేదు అమలాపాల్. మరోవైపు తన ఆడై సినిమా ప్రమోషన్ తో బిజీగా ఉంది. ఈ చిత్రంతో న్యూడ్ గా నటించింది అమలాపాల్. తన మాజీ భర్త పెళ్లి గురించి ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. పైగా ఈ విషయం గురించి అడిగితే తను ప్రస్తుతం ప్రేమలో ఉన్నానని సంచలన విషయం బయటపెట్టింది ఈ ముద్దుగుమ్మ. ఇండస్ట్రీలో ఉన్న వాడు కాదని.. బయటి వ్యక్తిని తాను ప్రేమిస్తున్నానని చెప్పింది ఈ భామ. ఇప్పట్లో తనకు పెళ్లి చేసుకునే ఉద్దేశ్యమే లేదని చెబుతుంది ఈ బ్యూటీ. కచ్చితంగా కొన్ని రోజుల తర్వాత పెళ్లి చేసుకుంటానని క్లారిటీ ఇచ్చింది అమలాపాల్.