English   

బిగ్ బాస్ వాయిదా ? నిజమేనా ?

 Bigg Boss
2019-07-15 12:07:48

బిగ్ బాస్...ఏమంటూ తెలుగునాట ఈ రియాలిటీ షో ప్రారంభం అయ్యిందో కానీ ఆనాటి నుండి టీఆర్పీలలో నూతన శకం అని చెప్పాలి. సినిమాలు వేసినప్పుడు కూడా రాని టీఆర్పీ ఈ షో నడిపిస్తున్నప్పుడు రావడంతో ఈ షో అనివార్యం అయ్యింది. అయితే ఈ షో మొదటి రెండు సీజన్లు కాస్త వివాదాలుగా మారినా అవి అంతగా హైలైట్ అయ్యేవి కాదు కాబట్టి అలా వచ్చి వెళ్ళిపోయాయి. కానీ ఈ బిగ్ బాస్ సీజన్ 3 మాత్రం ప్రారంభానికి ముందే రచ్చ రేపుతోంది. స్టార్ మా లో ప్రసారమయ్యే ఈ 'బిగ్ బాస్ సీజన్ 3 షో' కి హోస్ట్ గా నాగార్జున వ్యవహరించనున్నారు. ఈ నెల 21వ తేదీ నుంచి ఈ బిగ్ బాస్ షో మొదలవనుందని ప్రకటన కూడా చేసేశారు. కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఈ షో వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి. దానికి కారణం ఒక్కరు కాదు ఇద్దరు మహిళలు చేసిన సెక్స్ ఆరోపణలే అని అంటున్నారు విశ్లేషకులు. ఇంకా పది రోజుల్లో బిగ్ బాస్ ప్రారంభమవుతున్నదనుకున్న సమయంలో బిగ్ బాస్ లో కంటస్టెంట్లను ఎన్నుకునే విధానం, ఆ సమయంలో వారు అడుగుతున్న ప్రశ్నల మీద యూ ట్యూబ్ యాంకర్ శ్వేతా రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. బిగ్ బాస్‌(షో నిర్వాహకుల)ను ఇంప్రెస్ చేస్తేనే అవకాశం లభిస్తుందని ఆమెతో కోఆర్డినేటర్లు అన్నారని సంచలన ఆరోపణలు చేసింది ఆమె. అంతటితో ఆగక అది బిగ్‌బాస్ కాదు, బ్రోతల్ హౌస్ అని కూడా కామెంట్స్ చేసింది. ఆమె ఒక్కరే అంటే అనుకోవచ్చు, ఆమెకి తోడుగా మరో నటి కూడా నిన్న పోలీసులకి కంప్లైంట్ చేసింది.  రఘు , రవికాంత్ అనే వ్యక్తులు నన్ను కలిసి బిగ్ బాస్ లో పాల్గొంటావా అన్ని అడిగారని, రఘు, రవికాంత్, అభిషేక్ లు బిగ్ బాస్ ప్రోగ్రాం గురించి మాట్లాడుతూ నాతో అసభ్యంగా మాట్లాడారని ఆమె ఫిర్యాదు చేసింది. బిగ్ బాస్ 3 కి సంబంధించి నాతో అగ్రిమెంట్ చేసుకున్నాక, బిగ్ బాస్ ను ఎలా సుఖ పెడతారు అని అసభ్యంగా మాట్లాడి, దానికి తాను ఒప్పుకోకపోవడంతో కొన్నాళ్ళ తర్వాత బిగ్ బాస్ 3లో అవకాశం లేదని అన్నారని ఆమె ఫిర్యాదు చేసింది. దీంతో ఈ షో అసలు మొదలవుతుందా ? లేక ఈ కేసులు తేలే వరకూ వాయిదా పడుతుందా అనే సంశయం అందరిలోనూ నెలకొంది.  
 

More Related Stories