English   

మహేష్ కి కలిసి రాని సినిమాటోగ్రాఫర్ తో సరిలేరు నీకెవ్వరూ ? ఏమవుతుందో ?

 Ratnavelu
2019-07-15 15:19:20

సూపర్ స్టార్ మహేష్ కథానాయకుడిగా అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. షూట్ లో ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఇప్పటికే కాశ్మీర్ లో ఈ సినిమా మొదటి షెడ్యూల్ షూట్ జరుగుతోంది. కశ్మీర్ నుంచి ఆంధ్రాకి ప్రయాణించే రైలులో ఆర్మీ మేజర్ అజయ్ కృష్ణ పై కీలక సన్నివేశాల్ని తెరకెక్కించనున్నారని కూడా ప్రచారం జరిగింది. అయితే ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్ ఎవరనే విశాయం మీద ఇప్పటివరకూ క్లారిటీ లేదు. కానీ తాజాగా ఈ సినిమాకి మహేష్ ఫేవరెట్ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు పని చేస్తున్నారని అనిల్ రావిపూడి ప్రకటించారు. ఈ మేరకు ట్విట్టర్ లో ట్వీటిన ఆయన రత్నవేలుతో పని చేయడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. రత్నవేలు ఇటీవల మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా చిత్రానికి పని చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమా చిత్రీకరణ పూర్తయ్యింది కాబట్టి పూర్తిగా సరిలేరు సినిమా మీదే ఆయన ఉండనున్నారు. అయితే ఈయన మహేష్ కి మాత్రం కలిసి రాలేదు, ఆయన కెరీర్లో మర్చిపోలేని రెండు డిజాస్టర్ సినిమాలకి ఈయన పని చేశారు. ఒకరి వన్ నేనొక్కడినే కాగా మరొకటి బ్రహ్మోత్సవం. కానీ ఆయనకి ఆర్య- రోబో- కుమారి 21 ఎఫ్- ఖైదీనంబర్ 150- రంగస్థలం-జయం లాంటి సూపర్ హిట్స్ ఉన్నాయి. చూడాలి ఈసారి ఏమవుతుందో ?

More Related Stories