మెగా కుటుంబంతో అల్లుకున్న మంచు వారి అనుబంధం..

ఇండస్ట్రీలో మంచు, మెగా కుటుంబాల మధ్య మంచి అనుబంధం ఉంది. పైకి మోహన్ బాబు, చిరంజీవి మధ్య ఏదో ఉన్నట్లు కనిపిస్తుంది కానీ నిజానికి వాళ్ల మధ్య మాత్రం మంచి స్నేహం ఉంటుంది. అప్పుడప్పుడూ టామ్ అండ్ జెర్రీలా గొడవ పడినా కూడా వాళ్ల వారసులు మాత్రం మీకు మేము.. మాకు మీరు అన్నట్లుంటారు. ముఖ్యంగా మంచు లక్ష్మి అయితే మెగా కుటుంబంతో చాలా కలివిడిగా ఉంటుంది. తమ పర్సనల్ విషయాలు కూడా పంచుకునేంత స్నేహం ఉంటుంది. ఇక ఇప్పుడు కూడా తన కుమార్తె రామ్ చరణ్ తో దిగిన ఫోటోను ఇన్ స్టాలో షేర్ చేసింది లక్ష్మి. అక్కడితో ఊరుకోకుండా తన చిన్నతనంలో మెగాస్టార్ చిరంజీవితో ఇలాగే ఫోటో దిగినట్లు చెప్పింది మంచు లక్ష్మి. ఇప్పుడు తన కూతురు చరణ్ తో దిగిన ఫోటో చూస్తుంటే తనకు గతం గుర్తొస్తుందని చెబుతుంది మంచు వారసురాలు. చరణ్.. నేను మీ నాన్నతో కలిసి ఇలాంటి ఫొటోనే దిగా. జీవితం మళ్లీ మొదలైన చోటుకే వచ్చిన భావన కలుగుతోంది. మనది ఎంతో అద్భుతమైన ప్రయాణం. ఇలా మన స్నేహం మరిన్ని సంవత్సరాలు కొనసాగాలి. నీకు పిల్లలు పుట్టిన తర్వాత యాపిల్ వాళ్లకి పెద్ద అక్కగా ఉండే రోజు కోసం ఎదురుచూస్తున్నానంటూ ఇన్ స్టాలో షేర్ చేసింది. నీకు ఇన్స్టాగ్రామ్కు స్వాగతం చరణ్ అని పోస్ట్ చేసింది మంచు లక్ష్మి. ఇది చూసిన ఉపాసన దిస్ ఈజ్ సో క్యూట్ అంటూ రిప్లై ఇచ్చింది. మొత్తానికి ఈ రెండు కుటుంబాల మధ్య ఉన్న అనుబంధం మాత్రం చాలా అందంగా అల్లుకుంటుంది.