సమంత అక్కినేని చేస్తే చూస్తారు.. శ్రీరెడ్డి చేస్తే చూడరా..

ఎప్పుడూ ఇలాంటి కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూ ఉంటుంది శ్రీరెడ్డి. ఇప్పుడు కూడా ఇలాంటి కామెంట్స్ చేసింది ఈ బ్యూటీ. ఎప్పటికప్పుడు సంచలన కామెంట్స్ తో హాట్ హాట్ చర్చకు తెరతీస్తుంది శ్రీరెడ్డి. ఇప్పుడు కూడా సమంతపై ఇలాంటి కామెంట్స్ పోస్ట్ చేసింది శ్రీరెడ్డి. తాజాగా ఈమె చేసిన కామెంట్స్ రచ్చ చేస్తున్నాయి. ఓ బేబీ సినిమాపై ఈ మధ్యే ఇష్టమొచ్చిన కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది శ్రీరెడ్డి. ఇప్పుడు కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేసింది మళ్లీ. అయితే ఈ సారి సమంతను డైరెక్టుగా ఫోకస్ చేసింది. ఇప్పటికే మంచు లక్ష్మి.. జీవిత.. రకుల్.. ఇలా ఇండస్ట్రీలో ఉన్న వాళ్లందరిపై విరుచుకుపడిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు సమంతను టార్గెట్ చేసింది. శ్రీరెడ్డి ఎక్స్ పోజ్ చేస్తే ఏడుస్తారు.. సమంత చేస్తే చూస్తారు.. మారండిరా అరేయ్.. అని పోస్ట్ చేసింది. ఇది చూసి అంతా షాక్ అవుతున్నారు. అక్కడితో ఆగకుండా అయినా మీకు మీ పెళ్లానివి నచ్చవు.. పక్కింటోడి పెళ్లానివి నచ్చుతాయి.. తెలుగు అమ్మాయిలంటే చులకనే మరి ఈ తెలుగు ఇండస్ట్రీకి అంటూ శ్రీరెడ్డి సంచలన కామెంట్స్ పోస్ట్ చేసింది. మొత్తానికి మరి ఈ రచ్చ ఇంకెంత దూరం వెళ్తుందో చూడాలి.