గ్యాంగ్ లీడర్ ఫస్ట్ లుక్.. ఆ ఐదుగురుతో న్యాచురల్ స్టార్..

న్యాచురల్ స్టార్ నాని, విభిన్న చిత్రాల దర్శకుడు విక్రమ్ కె.కుమార్ కాంబినేషన్లో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న సినిమా గ్యాంగ్ లీడర్. ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదలైందిప్పుడు. ఇది చూసిన తర్వాత సినిమా ఎలా ఉండబోతుందో క్లారిటీ వచ్చేస్తుంది. ఐదుగురు ఆడవాళ్ల గ్యాంగ్ కు నాని లీడర్ గా నటిస్తున్నాడు. అందుకే ఈ సినిమా గ్యాంగ్ లీడర్ అయిపోయింది. చిరంజీవి ఆల్ టైమ్ క్లాసిక్ టైటిల్ అని తెలిసినా.. ఏదైనా తేడా జరిగితే అసలుకే మోసం వచ్చే ప్రమాదం ఉందని తెలిసినా కూడా ధైర్యం చేసారు దర్శక నిర్మాతలు. ఆగస్ట్ 30న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే షూటింగ్ చివరిదశకు వచ్చేసింది. ముఖ్యంగా ఐదుగురు లేడీస్ మధ్య ఈ కథ సాగుతుంది. ఫస్ట్ లుక్ లో కూడా ఇదే చూపించాడు దర్శకుడు విక్రమ్ కే కుమార్. 18న తొలి పాట విడుదల కానుంది.
బామ్మ, వరలక్ష్మి, ప్రియ, స్వాతి, చిన్ను చుట్టూ తిరిగే కథ ఇది. ఈ సినిమాలో నానితో పాటు కార్తికేయ, ప్రియాంక, లక్ష్మీ, శరణ్య, అనీష్ కురువిళ్లా, ప్రియదర్శి, రఘుబాబు, వెన్నెల కిశోర్, జైజా, సత్య ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం అనిరుధ్ రవిచందర్ అందిస్తున్నాడు. జెర్సీ సినిమా తర్వాత మరోసారి నాని సినిమాకు పని చేస్తున్నాడు అనిరుధ్. ఇక ఈ సినిమాకు విదేశీ సినిమాటోగ్రఫర్ మిరోస్లా కుబా బ్రోజెక్ పని చేస్తున్నాడు. మరోసారి ఈ చిత్రంతో తన సత్తా చూపించాలని ఉవ్విళ్లూరుతున్నాడు విక్రమ్ కే కుమార్. స్క్రీన్ ప్లే మార్క్ చూపించడానికి సిద్ధమవుతున్నాడు ఈ దర్శకుడు. హలో, 24 సినిమాలు అనుకున్న స్థాయిలో విజయం సాధించకపోవడంతో నిరాశలో ఉన్నాడు విక్రమ్. మరి నాని సినిమాతో ఏం మాయ చేస్తాడో చూడాలిక.