బిగ్ బాస్ టీంకు చుక్కలు.. హై కోర్టును ఆశ్రయించిన నిర్వాహకులు..

ఎందుకో తెలియదు కానీ బిగ్ బాస్ మూడో సీజన్ ను వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఎందుకో తెలియదు కానీ ఈ సారి మాత్రం బిగ్ బాస్ పై బాగా పగపట్టేసారు కొందరు. కావాలని చేస్తున్నారో.. లేదంటే నిజంగానే అలా జరుగుతుందో గానీ ఇప్పుడు బిగ్ బాస్ పై ఎక్కడలేని కాంట్రవర్సీలు నడుస్తున్నాయి. కొత్త సీజన్ మొదలవ్వడానికి మరో వారం రోజులు మాత్రమే సమయం ఉన్న ఈ టైంలో షో ఆపేయాలంటూ కోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై ఇప్పుడు బిగ్ బాస్ టీం కూడా హై కోర్టును ఆశ్రయించింది. క్వాష్ పిటిషన్ దాఖలు చేసారు బిగ్ బాస్ టీం. తమ షోలో కాస్టింగ్ కౌచ్ ఉందంటూ యాంకర్ శ్వేతా రెడ్డి, నటి గాయత్రి గుప్తాలు బంజారా హిల్స్, రాయదుర్గం పోలీస్ స్టేషన్ లలో పెట్టిన కేసులు కొట్టివేయాలని కోరుకుంటూ హై కోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసింది బిగ్ బాస్ టీం. అసలు వాళ్లు చెప్పిన దాంట్లో నిజాలు లేవంటున్నారు వాళ్లు. ఇదిలా ఉంటే ఈ షో వల్ల యువత నాశనం అవుతుందని.. ఇందులో అశ్లీలత కూడా ఎక్కువగా ఉందని మరో పిటిషన్ దాఖలైంది. సినిమాకు చేసినట్లుగానే ప్రతీ ఎపిసోడ్ సెన్సార్ చేసిన తర్వాత కానీ ప్లే చేయకూడదని.. అది కూడా రాత్రి 11 తర్వాతే టీవీలో వేయాలని పిటిషన్ లో పేర్కొన్నారు. ఇందులో నాగార్జునతో పాటు మరో 10 మంది పేర్లును కూడా పిటిషినర్ పేర్కొన్నాడు. జులై 21న షో మొదలు పెట్టాలనుకుంటున్న ఈ తరుణంలో ఇలా వచ్చే వివాదాలు షోను ఎలాంటి మలుపు తిప్పనున్నాయో అని టెన్షన్ పడుతున్నారు నిర్వాహకులు.