బాక్సాఫీస్ రణరంగం లో ఎవరు గెలుస్తారో ?

శర్వానంద్ హీరోగా ప్రముఖ దర్శకుడు సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా రణరంగం. , కాజల్, కళ్యాణి ప్రియదర్శిన్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాని హారికా హాసినీ వారి సితార ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది, మొదట ఈ సినిమా ఆగష్టు 2న రిలీజ్ చేయాల్సి ఉండగా, దానిని వాయిదా వేసి ఆగస్టు 15న విడుదల చేస్తున్నట్లు రిలీజ్ పోస్టర్ రిలేజ్ చేసింది సినిమా యూనిట్. ఈ సినిమాకి పోటీగా అడివి శేష్ నటించిన ‘ఎవరు’ కూడా ఆగష్టు 15న విడుదల కానుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ పోస్టర్ను విడుదల చేశారు. అయితే ‘రణరంగం’, ‘ఎవరు’ చిత్రాలకి సంబంధించి అఫీషియల్ ప్రకటనతో పాటు రిలీజ్ పోస్టర్ వచ్చేశాయి. ఇక ‘సాహో’ నుండి రిలీజ్ పోస్టర్ రావాల్సి ఉంది. అయితే అందుతున్న సమాచారం ప్రకారం ప్రభాస్ సినిమా వాయిదా పడనుంది. ఎందుకంటే ఈ రెండు సినిమాలు కూడా ప్రభాస్ సినిమాతో పోటీ పడే సాహసం మాత్రం చేయవు. ప్రభాస్ క్రేజ్ అలా ఉంది మరి. అయితే ఆ సినిమాలు అంత ధైర్యంగా రిలీజ్ డేట్ లు లాక్ చేసుకున్నాయి అంటే సాహో ఆ రోజు పోటీలో లేదని అంటున్నారు. ఇద్దరు యంగ్ హీరోలు ఒకే రోజు పోటీ పడుతుండటంతో బాక్సాఫీస్ 'రణరంగం' లో 'ఎవరు' గెలుస్తారోనేది ఆగష్టు 15న తేలిపోనుంది.