English   

ఇస్మార్ట్ హిట్టేనట....సెన్సార్ లాజిక్ !

ismart
2019-07-17 11:10:05

పూరీ జ‌గ‌న్నాథ్ సినిమా అంటే దానికి ప్రత్యేక క్రేజ్ ఉంటుంది. హిట్ బొమ్మయినా ప్లాప్ బొమ్మయినా అయినా ఆ స్టైల్ మాత్రం మార‌దు. అదే రచ్చ స్టైల్లో సినిమాలు చేస్తూ ఉంటాడు ఆయన. కొడుకుతో మెహ‌బూబా అని ఒక స్పెషల్ లవ్ స్టోరీ తీసినా అది వ‌ర్క‌వుట్ కాలేదు. దాంతో ఇప్పుడు పూర్తిగా మాస్ బొమ్మ అయిన ఇస్మార్ట్ శంక‌ర్ తెరకెక్కించాడు. ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, నిధి అగ‌ర్వాల్‌, న‌భా న‌టేశ్ హీరో హీరోయిన్లుగా రూపొందుతున్న ఈ సినిమాని పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరి కనెక్ట్స్ బ్యానర్స్ మీద పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి నిర్మిస్తున్నారు. జూలై 18న సినిమా విడుద‌ల కానుంది. ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్ నుంచి ‘ఏ’ సర్టిఫికెట్ పొందిందట ఈ సినిమా. సెన్సార్ నుంచి ‘ఏ’ సర్టిఫికెట్ రావడంతో సినిమా యూనిట్ కొత్త లాజిక్ చెబుతోంది. అదేంటంటే దేశముదురు, పోకిరి, బిజినెస్‌మేన్ ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్. ఈ చిత్రాలన్నింటికి సెన్సార్ నుంచి ఏ సర్టిఫికెట్టే వచ్చింది. కాబట్టి ముందు సినిమాలు హిట్ కాబట్టి, ఈ సినిమా కూడా తప్పక హిట్ కొడుతుందని తేల్చేశారు.  

More Related Stories