English   

ఈ వారం కూడా నాలుగు సినిమాలు...కానీ !

friday
2019-07-17 11:25:41

వీకెండ్ కి సమయం అయ్యింది. ఈ వారం నాలుగు సినిమాలు రిలీజ్ కానున్నాయి. అయితే నాలుగు సినిమాల్లో కూడా అందరి దృష్టి పూర్తిగా ఇస్మార్ట్ శంకర్ సినిమాపైనే ఉంది. పూరీ రామ్ కాంబినేషన్ కావడం,తెలుగు రాష్ట్రాల్లో 37 కోట్ల రూపాయల ప్రీ-రిలీజ్ బిజినెస్ చేయడంతో ఈ సినిమా మీద భీబత్సమైన క్రేజ్ ఏర్పడింది. అయితే ఈ సినిమాతో పాటు మరో 3 సినిమాలు కూడా గురు, శుక్రవారాల్లో ధియేటటర్లలోకి వస్తున్నాయి. అయితే ఆ మూడు సినిమాలు డబ్బింగ్ సినిమాలు. వీటిలో చెప్పుకోదగ్గ సినిమా అంటే 'ఆమె'. అమలాపాల్ లీడ్ రోల్ పోషించిన 'అడై' అనే తమిళ సినిమాని తెలుగులో డబ్బింగ్ చెప్పించి రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాకి క్రేజ్ రావడానికి కారణం ఉంది. అదేంటంటే ఈ సినిమాలో  అమలాపాల్ నగ్నంగా నటించింది. ఈ సినిమా పోస్టర్లతో పాటు టీజర్ లో కూడా ఆ నగ్నత్వాన్నే చూపించారు. అందుకే ఈ సినిమా హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాతో పాటు విక్రమ్ నటించిన 'మిస్టర్ కేకే' సినిమా కూడా రిలీజ్ కానుంది. రాజేష్ డైరక్ట్ చేసిన ఈ సినిమాని కమల్ హాసన్ నిర్మించగా ఆయన కూతురు అక్షర హాసన్ ఓ కీలక పాత్ర పోషించింది. వీటితో పాటు డిస్నీ సంస్థ నిర్మించిన 3d యానిమేషన్ మూవీ లయన్ కింగ్ కూడా ఈ శుక్రవారమే ధియేటర్లలోకి రానుంది. నాని, జగపతిబాబు, అలీ, బ్రహ్మానందం లాంటి ప్రముఖులు ఈ సినిమాలో జంతువుల పాత్రలకు డబ్బింగ్ చెప్పడంతో ఈ సినిమా కూడా మంచి క్రేజ్ నెలకొని ఉంది.

More Related Stories