English   

ఇస్మార్ట్ శంకర్ ప్రివ్యూ !

ismartshankar
2019-07-17 15:47:59

విలక్షణ డైరెక్టర్ పూరి జగన్నాధ్, ఎనర్జిటిక్ హీరో రామ్ కాంబినేషన్ లో ఇస్మార్ట్ శంకర్ రేపు రిలీజ్ కానుంది. గత కొంత కాలంగా రామ్, పూరి జగన్నాధ్ ఇద్దరికీ వరుసగా డిజాస్టర్లు ఎదురు కావడంతో ఎలా అయినా హిట్ కొట్టాలనే ఉద్దేశ్యంతో పక్కా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఇస్మార్ట్ శంకర్ ని తెరకెక్కించారు. మునుపెన్నడూ లేని విధంగా ఈ సినిమాలో రామ్ ఊర మాస్ లుక్‌ తో అదరగొట్టాడు. అంతే కాక చాలా ఈజ్ తో పక్కా హైదరాబాదీ తెలంగాణా స్లాంగ్ తో రచ్చ రేపుతున్నాడు. రామ్ సరసన నిధి అగర్వాల్, నభా నటాష్ లు నటిస్తున్న ఈ సినిమాకి తాజాగా సెన్సార్ అయ్యింది. సెన్సార్ అధికారులు సినిమా చూసి ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. ఇక ఈ సినిమా రన్ టైం రెండు గంటల ఇరవై నిముషాలతో పక్కా పూరీ మార్క్ సినిమాలా ఉందని అంటున్నారు. అంతే కాక పలు డైలాగ్స్ కు బీప్ చెప్పిందట. అయితే ట్రేడ్‌ పరంగా కూడా ఈ సినిమా అంచనాలని పెంచేస్తోంది. రీసెంట్ గా  మాస్‌ సినిమాలేవీ రాకపోవడంతో ఈ సినిమా మీద ఆసక్తి ఉన్నట్టు సమాచారం. ఇక సినిమా హిట్ అయ్యి మంచి కలక్షన్స్ వస్తే మాత్రం ఇండస్ట్రీకి పండగే అని అంటున్నారు ట్రేడ్ వర్గాల వారు. మొత్తానికి ఇస్మార్ట్ సినిమా ఇస్మార్ట్ గా ఉందని అంటున్నారు. మరి ఈ సినిమాని ప్రేక్షకులు ఎంత వరకూ ఆదరిస్తారో చూడాలి మరి.

More Related Stories