విజయ్ దేవరకొండ అభిమానులపై పోలీసుల లాఠీ ఛార్జ్..

అవును.. వినడానికి కాస్త విచిత్రంగా ఉన్నా కూడా ఇప్పుడు ఇదే జరిగింది. ప్రస్తుతం విజయ్ డియర్ కామ్రేడ్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం జులై 26న విడుదల కానుంది. అన్నింటికి మించి తెలుగుతో పాటు నాలుగు దక్షిణాది భాషల్లోనూ విడుదలవుతుంది ఈ చిత్రం. అందుకే తెలుగు రాష్ట్రాలతో పాటు మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఈ చిత్రం ప్రమోషన్ మొదలు పెట్టాడు విజయ్. ఇందులో భాగంగానే ఇప్పటికే బెంగళూర్ లో ఓ భారీ ఈవెంట్ చేసాడు. అక్కడ రష్మిక మందన్నతో కలిసి డాన్సులు కూడా చేసాడు ఈయన. ఇక కొచ్చిలో కూడా భారీ ఈవెంట్ నిర్వహించారు. అక్కడ కూడా విజయ్ దేవరకొండతో పాటు రష్మిక డాన్సులు ఇరగదీసింది. అంతా బాగానే ఉన్నా ఇప్పుడు అనుకోని ఇబ్బందులు వచ్చాయి విజయ్ దేవరకొండకు. ఈ ఈవెంట్స్ కు భారీ క్రేజ్ నెలకొనడం.. పాసులు కూడా సరిగ్గా రాకపోవడంతో అభిమానులు నిరాశ పడ్డారు. అయితే తెలుగులో విజయ్ దేవరకొండకు ఎంత క్రేజ్ ఉన్నా తప్పు లేదు కానీ ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లో కూడా విజయ్ ఫాలోయింగ్ చూసి మెంటల్ వచ్చేస్తుంది. ఈ ఈవెంట్ పాసుల కోసం అభిమానులు ఆడిటోరియం బయట గోల చేస్తుంటే వాళ్లను కంట్రోల్ చేయలేక పోలీసులు లాఠీ ఛార్జ్ చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత విజయ్ బయటికి వచ్చి అభిమానులను ఓదారుస్తున్నాడు. చెన్నై, హైదరాబాద్ లలో జరగబోయే ఈవెంట్స్ లో ఇలాంటి పొరపాట్లు లేకుండా చూసుకోవాలని మేనేజర్స్ ను ఆదేశించాడు విజయ్ దేవరకొండ. ఏదేమైనా ఇప్పుడు ఈయన క్రేజ్ చూస్తుంటే మిగిలిన వాళ్లకు పిచ్చెక్కిపోతుంది.