బిగ్ బాస్ తో నాగార్జునకు తిప్పలు తప్పవా.. కోరి కష్టాల్లో పడ్డాడా..?

ఇప్పటి వరకు బిగ్ బాస్ రెండు సీజన్స్ గుట్టుచప్పుడు కాకుండా పూర్తైపోయాయి. ఎప్పుడొచ్చాయో.. ఎప్పుడు అయిపోయాయో అన్నట్లుంది మ్యాటర్. కానీ ఇప్పుడు మాత్రం సీన్ మారిపోయింది. మూడో సీజన్ కోసం నానా యాగీ జరుగుతుంది. ఇంకా సీజన్ స్టార్ట్ కాకముందే శ్వేతా రెడ్డి, గాయత్రి గుప్తా లాంటి వాళ్లు పోలీస్ స్టేషన్ మెట్లెక్కి అక్కడ నానా రచ్చ చేస్తున్నారు. ఇదంతా చూస్తుంటే ఇప్పుడు నాగార్జున మెడకు ఎక్కడ చుట్టుకుంటుందో అని భయపడుతున్నారు అభిమానులు. ఇప్పటి వరకు ఈయన రియాలిటీ షోలు చేయలేదు.. మీలో ఎవరు కోటీశ్వరుడు చేసినా అది రియాలిటీ షో కాదు. పైగా దాన్ని తన స్టార్ ఇమేజ్ తో బ్లాక్ బస్టర్ చేసాడు నాగార్జున. ఆ నమ్మకంతోనే ఇప్పుడు బిగ్ బాస్ తీసుకెళ్లి ఆయన చేతుల్లో పెట్టారు స్టార్ యాజమాన్యం. కానీ ఇది మొదలు కాకముందే జరుగుతున్న రచ్చ చూసి ఆయన భయపడుతున్నాడేమో అనిపిస్తుంది. అనవసరంగా ఈ సీజన్ ఒప్పుకున్నాడేమో అని సన్నిహితులు కూడా టెన్షన్ పడుతున్నారు. ఎలాగూ ఇప్పుడు నాగార్జునకు చేతినిండా సినిమాలు ఉన్నాయి. ఓ వైపు మన్మథుడు 2 రిలీజ్ కు రెడీ అవుతుంటే.. మరోవైపు బంగార్రాజు సినిమాను సంక్రాంతికి సిద్ధం చేయాల్సి ఉంది. ఇలాంటి టైట్ షెడ్యూల్ లో కూడా బిగ్ బాస్ 3 ఒప్పుకున్నాడు నాగార్జున. జులై 21 నుంచి ఈ కొత్త సీజన్ షురూ కానుంది. మరి చూడాలిక.. ఈ రచ్చ నుంచి నాగార్జున ఎలా తప్పించుకుంటాడో.. ఇంట్లో జరిగే రచ్చను తన మాటలతో ఎలా కంట్రోల్ చేస్తాడో..? ఇదంతా ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారింది.