ఇక రాజకీయాలే దిక్కు...సినిమాలకి గుడ్ బై !

తెలుగు సినిమాలలో అత్తగా, అక్కగా, భార్యగా, వదినగా ఇలా పలు సపోర్టింగ్ క్యారెక్టర్స్‌లో నటించి మెప్పించింది హేమ. ఈ మధ్య కాలంలో ఆమె సినిమాలకి దూరంగా ఉంటున్నారు. ఆ మధ్య వినయవిదేయ రామ సినిమాలో నటించిన ఈమె నిన్న సంచలన ప్రకటన చేశారు. నిన్న రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఆమె సినిమాలు మానేస్తున్నట్టు ప్రకటించారు. అలాగే త్వరలో హైదరాబాద్ వదిలేసి ఆమె రాజమండ్రి వెళ్ళిపోయి పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించారు. హేమ గతంలో నల్లారి కిరణ్ కుమార్‌రెడ్డి స్థాపించిన జైసపా తరఫున రాజమండ్రి ఎమ్మెల్యేగా పోటీచేసి ఓటమిపాలయ్యారు. ఇక ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో వైసీపీలో చేరి ఆ పార్టీకి ప్రచారం చేశారు. ఈ క్రమంలోనే సినిమాలకి గుడ్ బై చెప్పి పూర్తి రాజకీయాలలోనే ఉండాలని భావిస్తున్నట్టు తెలిపింది హేమ. రాజమండ్రిలో ఇల్లు కట్టించుకున్నానని చెప్పిన ఆమె ఆ ఇల్లు గృహ ప్రవేశం అవగానే అక్కడికి షిఫ్ట్ అవుతానని ఆమె చెప్పుకొచ్చింది.