బ్లాక్ బస్టర్ దర్శకుడిపై సీరియస్ అయిన జగ్గూ భాయ్..

ఇండస్ట్రీలో కూలెస్ట్ యాక్టర్స్ లో జగపతిబాబు కూడా ఉంటాడు. ఎప్పుడూ తన పని తాను చేసుకుంటూ ఛిల్ అవుతుంటాడు ఈయన. వరస సినిమాలతో దూసుకుపోతున్న ఈ మాజీ హీరోకు ఇప్పుడు అనుకోని షాక్ తగిలింది. మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమా నుంచి ఈయన్ని తప్పించాడు దర్శకుడు అనిల్ రావిపూడి. మహర్షి లాంటి హిట్ సినిమా తర్వాత మహేష్ బాబు నటిస్తున్న సినిమా కావడంతో సరిలేరు నీకెవ్వరుపై అంచనాలు భారీగా ఉన్నాయి. పైగా నాలుగు విజయాలతో ఊపు మీదున్న అనిల్ రావిపూడి ఈ సినిమాకు దర్శకుడు. ఇవన్నీ కలిసొచ్చి సరిలేరు నీకెవ్వరు బిజినెస్ కూడా ఇప్పట్నుంచే రప్ఫాడిస్తుంది. అంతా సాఫీగా సాగిపోతున్న సమయంలో జగపతిబాబు సడన్గా తప్పుకోవడంతో లేనిపోని చర్చలు మొదలయ్యాయి. ఈయన ఎందుకు తప్పుకున్నాడనే విషయంపై ఇప్పుడు చాలా పెద్ద రచ్చే జరుగుతుంది.
అయితే ఇప్పుడు వస్తున్ వార్తల ప్రకారం జగపతిబాబు కావాలనే ఈ చిత్రం నుంచి తప్పుకున్నాడని తెలుస్తుంది. ఈయనకు దర్శకుడు అనిల్ ముందు చెప్పిన సీన్స్ కు ఆ తర్వాత ఇప్పుడు తెరకెక్కిస్తున్న సీన్స్ కు పొంతన లేకపోవడమే బయటికి రావడానికి కారణం అని తెలుస్తుంది. దాంతో ఈ కుర్ర దర్శకుడిపై జగ్గూ భాయ్ ఫైర్ అయినట్లు ప్రచారం జరుగుతుంది. ఈయన బయటికి రావడం సినిమాకు కూడా మైనసే. ఎందుకంటే మహేష్ బాబుతో జగపతిబాబుది బ్లాక్ బస్టర్ కాంబినేషన్. శ్రీమంతుడు, మహర్షి సినిమాల్లో కలిసి నటించారు ఈ ఇద్దరూ. ప్రస్తుతం కాశ్మీర్ లో సరిలేరు నీకెవ్వరు రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది. ఇప్పుడు జగ్గూ భాయ్ తప్పుకోవడంతో ఆ పాత్రలో ప్రకాశ్ రాజ్ ను తీసుకుంటున్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి. మరి ఇది ఈ చిత్రంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూడాలి.