English   

అక్కినేని హీరోకు బావ అయిపోతున్న అల్లు అర్జున్..

allu
2019-07-17 19:25:11

అవును.. ఇప్పుడు నిజంగానే అక్కినేని హీరోకు బావ అయిపోతున్నాడు అల్లు అర్జున్. ఈయ‌న ప్ర‌స్తుతం త్రివిక్రమ్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తున్నాడు. నా పేరు సూర్య త‌ర్వాత చాలా రోజులు ఖాళీగా ఉన్న ఈయ‌న త్రివిక్ర‌మ్ సినిమాకు ఓకే చెప్పాడు. నాన్న సెంటిమెంట్ తో ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ గా ఈ చిత్రం తెర‌కెక్కుతుంది. ఇందులో కామెడీకి కూడా చోటు ఉంటుంద‌ని చెబుతున్నాడు మాట‌ల మాంత్రికుడు. అర‌వింద స‌మేత‌తో ఓకే అనిపించిన త్రివిక్ర‌మ్.. ఇప్పుడు బ‌న్నీ సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టాల‌ని చూస్తున్నాడు. ఇప్ప‌టికే ఈ చిత్ర షూటింగ్ వేగంగా జ‌రుగుతుంది. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో సుశాంత్ కూడా కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నాడు. ఇందులో హీరోయిన్ పూజా హెగ్డేకు అన్న‌య్య‌గా సుశాంత్ న‌టిస్తున్నాడ‌ని తెలుస్తుంది. అలాగే బ‌న్నీ చెల్లిగా నివేదా థామ‌స్ న‌టిస్తుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.
ఈ ఇద్ద‌రూ కుండ మార్పిడి చేసుకుంటార‌ని.. అక్క‌డ్నుంచి సినిమాలో కామెడీ మొద‌ల‌వుతుంద‌ని తెలుస్తుంది. దీనికి త‌న‌దైన స్టైల్లో స్క్రీన్ ప్లే అద్ది థియేట‌ర్ల‌లో న‌వ్వులు పూయించ‌నున్నాడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్. సుశాంత్ చెల్లిగా పూజా ఓకే కానీ.. అస‌లు బ‌న్నీకి చెల్లిగా నివేదా ఎలా న‌టిస్తుంద‌బ్బా అనే అనుమానాలే అంద‌రికీ వ‌స్తున్నాయి. ఇంత త్వ‌ర‌గా స్టార్ హీరోల‌కు చెల్లి అయిపోతే ఆ త‌ర్వాత కూడా అలాంటి పాత్ర‌లే వ‌స్తుంటాయి. ఈ సినిమా షూటింగ్ ఇప్ప‌టికే 40 శాతం పూర్తైపోయింది. సంక్రాంతికి సినిమా విడుద‌ల కానుంది. మొత్తానికి ఏదేమైనా మెగా హీరోను అక్కినేని హీరోకు బామ్మ‌ర్దిని చేసాడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్. మ‌రి వీళ్ళ రిలేష‌న్ స్క్రీన్ పై ఎలా ఉండ‌బోతుందో చూడాలి.

More Related Stories