వర్మ ఆ అమ్మాయిని అంతగా ఎందుకు ప్రమోట్ చేస్తున్నాడు..?

పక్క వాళ్లను వాడుకుని తన సినిమాలకు ప్రమోషన్ చేసుకుంటాడే కానీ తానే ఒకరికి ఫ్రీ ప్రమోషన్ మాత్రం చేసిపెట్టడు వర్మ. అది అసలు అతడి నేచర్ కూడా కాదు. అలా జరిగిందంటే మాత్రం ఏదో అద్భుతం జరిగుండాలి. ఇప్పుడు వర్మ విషయంలో ఇలాంటి అద్భుతం ఒకటి జరుగుతుంది. ఈయన ఓ అమ్మాయికి తెగ పబ్లిసిటీ ఇస్తున్నాడు. సోషల్ మీడియాలో కూడా ప్రచారం చేస్తున్నాడు. ఆమె మరెవరో కాదు.. ఆయన మేనకోడలు శ్రావ్య వర్మ. ఈమెను సినిమాల్లోకి తీసుకొస్తున్నాడు వర్మ. ఇప్పటికే తను తెరకెక్కించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకు కాస్ట్యూమ్ డిజైనర్ గా చేసింది శ్రావ్య. ఇక ఇప్పుడు ఈమె నిర్మాతగా కూడా మారింది. కీర్తి సురేష్ హీరోయిన్ గా ప్రస్తుతం సెట్స్ పై ఉన్న లేడీ ఓరియంటెడ్ చిత్రాన్ని శ్రావ్య వర్మ మరో నిర్మాతతో కలిసి సంయుక్తంగా నిర్మిస్తుంది.
నగేశ్ కుకునూర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో హీరో ఆది పినిశెట్టి కీలక పాత్రలో నటిస్తున్నాడు. పైగా ఈ చిత్రానికి దిల్ రాజు సమర్పకుడిగా ఉన్నాడని నిర్మాతలే చెబుతున్నారు. ఈమె ట్వీట్ కు స్పందిస్తూ ఈ సినిమాతో నువ్ కచ్చితంగా విజయం సాధిస్తావని దీవించాడు. ఇది కచ్చితంగా మంచి సినిమా అవుతుందని చెప్పాడు వర్మ. కాస్ట్యూమ్ డిజైనర్ గా ఎన్నో సినిమాలకు పని చేసిన ఈమె ఇప్పుడు నిర్మాతగా తన లక్ టెస్ట్ చేసుకుంటున్న తరుణంలో వర్మ లాంటి దర్శకుడి సపోర్ట్ అందుకోవడం కూడా సినిమాకు ప్లస్ కానుంది. ఎలాగూ మేనమామ కాబట్టి కోడలి బాధ్యత తీసుకుంటున్నాడు రామ్ గోపాల్ వర్మ. మరి ఈయన ప్రమోషన్ సినిమాకు ఎంత వరకు హెల్ప్ చేస్తుందో చూడాలి.