English   

నానికి టెన్షన్ గా మారిన సాహో వాయిదా ?

nani
2019-07-18 07:52:34

ప్రభాస్ దెబ్బకి ఇద్దరు హీరోలు సంతోష పడుతుంటే నాని మాత్రం బెంబేలు ఎత్తల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ముందు నుండీ సాహో సినిమా ఆగష్టు 15న అని అందరూ ఫిక్స్ అయిపోయారు. దానికి తగ్గ్గట్టు ఒక పది రోజులు గ్యాప్ ఉండేలా సినిమా డేట్ లు లాక్ చేసుకున్నారు. కానీ దురదృష్టమో అదృష్టమో ప్రభాస్ సినిమా వాయిదా పడింది. ఆ న్యూస్ ఇంకా కన్ఫాం కూడా చేయలేదు, అప్పుడే ఆరోజుని రెండు సినిమాలు పంచేసుకున్నాయి. కొంతలో కొంత ఆ రెండు సినిమాల హీరోలు సేఫ్ అన్నమాట. అయితే ఇప్పుడు ప్రభాస్ సినిమా నాని కొంప ముంచేలా ఉంది. దానికి కారణం ఆ సినిమా పదిహేను రోజులు వాయిదా పడడమే. ఇండస్ట్రీ వర్గాల సమాచారాన్ని బట్టి చెబుతున్నదాన్ని బట్టి సాహో ఆగస్టు 30న విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సమాచారం వలనే నానీ టెన్షన్ పడుతున్నాడు. ఎందుకంటే విక్రమ్‌కుమార్ డైరెక్షన్‌లో నానీ హీరోగా వస్తున్న గ్యాంగ్ లీడర్ సినిమా కూడా ఆరోజునే రిలీజ్ డేట్ లాక్ చేసుకోవడం. నిజానికి ఈ సినిమా మొదలయిన నాటి నుండి  పెద్దగ ప్రమోషన్స్ కూడా చేయలేదు. అలాంటిది నాలుగురోజుల క్రితమే మొదలెట్టి ప్రీ లుక్ అని ఫస్ట్ లుక్ అని రిలీజ్ చేశారు. ఇంత చేసినా ఓకవేళ సాహో గనుక ఆగస్టు 30న విడుదలకు రెడీ అయితే నానీ తన మూవీని వాయిదా వేసుకోవడం తప్పనిసరి. ఎందుకంటే సాహో క్రేజ్ అలాంటిది మరి. ఇంతకీ అధికారిక ప్రకటన లేకున్నా సాహో వాయిదా వార్త ఇంకెంత మంది గుండెల్లో రైళ్ళు పరిగేట్టిస్తుందో మరి ?

More Related Stories