English   

సోషల్ మీడియాలో సరికొత్త ఛాలెంజ్ విసిరిన మహానటి దర్శకుడు !

nag
2019-07-18 20:23:37

సోష‌ల్ మీడియా జనాల జీవితాల్లో ప్రముఖ పాత్ర పోషిస్తోది. ఎప్పుడూ ఏదో ఒక చాలెంజ్ తో సోషల్ మీడియా అలరారుతూ ఉంటుంది. అలా వచ్చినవే ఐస్‌ బ‌కెట్ ఛాలెంజ్‌, రైస్ బ‌కెట్ ఛాలెంజ్‌, బాటిల్ క్యాప్ ఛాలెంజ్. కాని వీటికి భిన్నంగా ప్ర‌స్తుత పరిస్థితుల‌ని బ‌ట్టి మ‌హాన‌టి ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ వ‌న్ బ‌కెట్ ఛాలెంజ్ చేశాడు. ప్రస్తుతం ప్రపంచం లో చాలా చోట్ల భూగర్భ జలాలు అడుగంటి పోతుండడంతో అనేక ప్రాంతాల ప్రజలు నీటి కోసం ముప్పు తిప్పలు పడుతున్నారు. ఈ సమస్య రానున్న రోజులలో హైదరాబాద్‌కి కూడా రానుందని ప్రచారం మొదలయ్యింది. ఇలాంటి పరిస్థితి రాకూడదంటే నీటిని ఆదా చేయడం ఒక్కటే మార్గం. అందుకే మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ కాస్త విభిన్నంగా ఆలోచించి వన్ బకెట్ ఛాలెంజ్ చేశాడు. కనీసం ఒక్కరోజైనా కేవలం ఒక బకెట్ నీటిని మాత్రమే ఉపయోగించి దిన చర్య ముగించాలని ఆయన పిలుపునిచ్చాడు. రోజూ దినచర్యలైన బ్రష్‌, బాత్, టాయిలెట్‌ ఇలా అన్ని అవసరాలని కేవలం ఒక్క బకెట్ నీటితో మాత్రమే తీర్చుకోవాలని ఆయన సోషల్ మీడియా ద్వారా చాలెంజ్ చేశారు. జూలై 21న అంటే ఈ ఆదివారం కేవలం ఒక బకెట్ నీటిని మాత్రమే ఉపయోగించాలని ఆయన చాలెంజ్ చేశారు. మంచి పనికోసం నాగ్ అశ్విన్ చేసిన ఛాలెంజ్‌ని ఎంత మంది స్వీకరిస్తారో చూద్దాం.

More Related Stories