English   

రీ ఎంట్రీకి రెడీ అయిన కలర్స్ స్వాతి !

swathi
2019-07-18 20:40:26

తెలుగమ్మాయి అయిన మన సినిమాలలో బాగానే రాణించింది, స్వాతి రెడ్డి అలియాస్ కలర్స్ స్వాతి. బుల్లితెర యాంకర్ గా జీవితం మొదెట్టి ఆ షో పేరునే తన ఇంటి పేరుగా మార్చుకుని కలర్స్ స్వాతి గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి, తెలుగు-తమిళం-మలయాళంలో పలు క్రేజీ చిత్రాల్లో నటించిన ఈమె ఈ మధ్యనే తన చిన్ననాటి స్నేహితుడు పైలెట్ వికాస్ ని పెళ్లాడి విదేశాల్లో సెటిల్ అయిపోయింది. అయితే అందరి నటీమణుల్లాగే ఆమె కూడా సైలెంట్ అయిపోతుందని భావించారు. కానీ తాజాగా స్వాతి మళ్ళీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తోందని ప్రచారం జరుగుతోంది. అయితే అది టాలీవుడ్ లో కాదట మాలీవుడ్ లో అట. అక్కడి పాపులర్ హీరో జయసూర్య హీరోగా, రాజేష్ మోహనన్ అనే దర్శకుడు తెరకెక్కిస్తున్న త్రిస్సూర్ పూరమ్ అనే సినిమాలో చిత్రంలో ఆమె నటిస్తోంది. ఇందులో ఆమె జయసూర్య భార్యగా నటించనున్నారని అంటున్నారు. మళయాళ చిత్రసీమలో స్వాతి ఇప్పటికే పలువురు స్టార్ హీరోల సరసన నటించి మంచిపేరు తెచ్చుకుంది. ఇప్పటికే ఆమె జయసూర్యకి జంటగా ఆడు అనే సినిమాలో నటించింది. మరోసారి అదే జోడీ రిపీటవుతుండడంతో ఈ సినిమా మీద అంచనాలు పెంచుతోంది. మరి మళయాళంలో ఎంట్రీ ఇస్తున్న ఈ భామ సొంత బాష టాలీవుడ్ లో ఎప్పుడు రీ ఎంట్రీ ఇస్తుందో చూద్దాం.

More Related Stories