English   

ఇట్స్ అఫీషియల్...సాహో వాయిదా...ఎప్పటికంటే ?

Saaho
2019-07-19 14:54:44

హమ్మయ్య ఎట్టకేలకి సస్పెన్స్ వీడింది.  రెండు రోజుల నుండి ఆగస్ట్ 15 సాహో విడుదల కావడం లేదన్న ప్రచారం మొదలయిన నాటి నుండి కంటి మీద కునుకు కూడా లేకుండా ఎదురు చూస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్, అలాగే సినీ అభిమానులు. తాజాగా వారి టెన్షన్ కి తెర దించుతూ యువి ప్రొడక్షన్స్ సంస్థ అఫీషియల్ గా తమ సినిమా కొత్త డేట్ ప్రకటించింది. నాణ్యత అలాగే కంటెంట్ విషయంలో రాజీ పడే ఆలోచన లేకపోవడం వలెనే తమకు ఇబ్బందిగా అనిపిస్తున్నా తప్పక సినిమాని మరో పదిహేను రోజులు వాయిదా వేస్తున్నామని ప్రకటించింది. ఆగస్ట్ 30 న సినిమా రిలీజ్ అవుతుందని ఈరోజు కొద్దిసేపటి క్రితం రిలీజ్ చేసిన ప్రెస్ నోట్ లో పేర్కొంది. నిజానికి చూసుకుంటే వాస్తవానికి ‘సాహో’ సినిమాకు దేశ వ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన శ్రద్దా కపూర్ నటిస్తుండగా  జాకీ ష్రాఫ్ - నీల్ నితీష్ - మందిరా బేడీ - మహేష్ మంజ్రేకర్ - మురళి శర్మ - వెన్నెల కిషోర్ - అరుణ్ విజయ్ - చుంకీ పాండే లాంటి నటులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే ఈ సినిమా వాయిదాకి ముఖ్య కారణం ఈ సినిమా కోసం ఎంతో ఎదురు చూస్తున్న ప్రేక్షకులని అలరించడం కోసమే అని చెప్పడం కొసమెరుపు.

More Related Stories