English   

ఆమె ఫస్ట్ షోలు రద్దు...అసలేమైంది ?

Amala Paul
2019-07-19 18:09:50

అమలాపాల్ లీడ్‌లో నటించిన తమిళ చిత్రం ఆడైను తెలుగులో ఆమె పేరుతో డబ్ చేసి ఈరోజు విడుదల చేస్తున్నారు. ఎమ్.ఆర్ రత్న దర్శకత్వం వహించిన ఈ సినిమాని తెలుగులో తమ్మారెడ్డి భరద్వాజ కొని విడుదల చేస్తున్నారు. తమిళ్‌లో ఆడై అంటే ‘డ్రస్’ అని అర్ధం. ఈ టైటిల్‌కి తగ్గట్టుగానే ఈ సినిమా టీజర్‌లో అమలాపాల్ డ్రెస్ లేకుండా పూర్తి నగ్నంగా నటించింది. అందుకే ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు నెలకొని ఉన్నాయి. అయితే కొన్ని కారణాల వల్ల ఈ సినిమా మార్నింగ్ షో, అలాగే ప్రెస్ షోలు రద్దయ్యాయి. రద్దు అవటానికి గల కారణం స్పష్టంగా తెలియకున్నా సినిమాకి ఉన్న ఫైనాన్స్ ఇష్యూస్ వలెనే సినిమా ఆగిందని అంటున్నారు. అయితే ఈ సినిమా మీద సేలేబ్రిటీలు మాత్రం ప్రశంసలు కురిపిస్తున్నారు. ఫైనాన్స్ ఇష్యూస్ క్లియర్ చేసుకుని ఈరోజు మధ్యాహ్నం నుంచి సినిమా థియేటర్లలోకి రావచ్చని అంటున్నారు. అయితే ఎక్కడా షో పడకుండా సెలెబ్రిటీలు ట్వీట్స్ మొదలు పెట్టడంతో సేలేబ్రిటీ షో మాత్రమే వేశారని అంటున్నారు. దీని మీద మరింత క్లారిటీ రావలసి ఉంది.

More Related Stories