English   

ఆర్ఆర్ఆర్ లో తల్లి పాత్ర....అరకోటి మాత్రమే ?

RRR
2019-07-19 18:28:18

టెక్నాలజీ ఎంతగా ముందుకు వెళ్తున్నా కొందరు మాత్రం మోసగాళ్ళ చేతుల్లో మోసపోతూనే ఉన్నారు. అలాంటి ఘటనే తాజాగా హైదరాబాద్ నగరంలో చోటు చేసుకుంది. బాహుబలి తర్వాత  దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. మెగా హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, నందమూరి హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న ఈ మెగా మల్టీస్టారర్ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. వాటినే క్యాష్ చేసుకోవాలని చూశాడు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో హీరో తల్లి వేషం ఇప్పిస్తానని ఓ మోసగాడు చెప్పిన మాటలు నమ్మిన మహిళా న్యాయవాది అతడికి ఏకంగా రూ.50లక్షలు సమర్పించుకుంది. తీరా మోసపోయానని తెలుసుకున్న బాధితురాలు తన డబ్బులు తిరిగిచ్చేయాలని కోరగా  అసభ్యంగా మాట్లాడడమే కాక చంపుతానని బెదిరించారు. దీంతో ఆమె ఫిర్యాదు చేయగా పోలీసులు నిందితుడితో ఆరదండాలు వేయించారు. కొండాపూర్‌ మసీద్‌బండ ప్రాంతానికి చెందిన నరేష్ కుమార్‌ (28) బంజారాహిల్స్‌ లోని కలర్ ల్యాబ్స్‌ లో ఆఫీస్‌ బాయ్‌గా పనిచేస్తున్నాడు. జస్ట్‌ డయల్‌ ద్వారా న్యాయవాదుల ఫోన్‌ నంబర్లను సేకరించి తాను ఒక సినీ ప్రొడ్యూసర్‌నని, న్యాయ సహాయం కావాలంటూ ఫోన్‌ చేసి మాటలు కలిపేవాడు. అలా అతని బుట్టలో పడింది ఒక సీనియర్ న్యాయవాది. ఆమె వద్ద తాను రాజమౌళి తీస్తున్న ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాకు ప్రొడ్యూసర్‌నని నమ్మించి రాజమౌళితో మాట్లాడి హీరో తల్లివేషం ఇప్పిస్తానని నమ్మబలికి పలు దఫాలుగా 50 లక్షలు కాజెసాడు. ఆమె తిరిగి అడగగా అసభ్యంగా తిట్టడమే కాకా చంపుతానని బెదిరించడంతో ఆమె పోలీసులని ఆశ్రయించింది. పోలీసులు విచారించి మొత్తం 13 మంది ముఠాని అరెస్ట్ చేశారు. 
 

More Related Stories