మహాసముద్రంలో రవితేజతో పాటు మరో కుర్ర హీరో !

‘ఆర్ఎక్స్ 100’ భారీ హిట్ కొట్టిన తర్వాత చిత్ర పరిశ్రమలోనూ, ప్రేక్షకుల్లోనూ దర్శకుడు అజయ్ భూపతి పేరు విపరీతంగా వినిపించింది. ఆయన నితిన్ తో సినిమా చేస్తారంటూ జోరుగా వార్తలు వినిపించాయి. అది నిజం కాగ పోగా బెల్లంకొండ శ్రీనివాస్ తో సినిమా చేస్తారని అన్నారు అన్నారు. మహాసముద్రం టైటిల్‌తో అజయ్ భూపతి ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్నారని, ఇదొక మల్టీస్టారర్ సినిమా అని ఇందులో ఓ కథానాయకుడిగా నటించేందుకు బెల్లకొండ సాయి శ్రీనివాస్ అంగీకరించాడని వార్తలు వచ్చాయి. అయితే తాజాగా అవేవే కాకుండా ఆయన రవితేజతో ఈ సినిమా చేస్తున్నారని వార్తలు మొదలయ్యాయి. ఈ సినిమాలో రవితేజతో పాటుగా హీరో సిద్దార్థ్ కూడా నటిస్తున్నారని అంటున్నారు. త్వరలోనే ఈ సినిమా మీద అధికారిక ప్రకటన వచ్చే అవకాశం కనిపిస్తోంది. రవితేజ సిద్దార్థ్ లతో పాటుగా అజయ్ కూడా నటిస్తున్నాడని విశాఖపట్నం సముద్రంలో స్మగ్లింగ్ నేపధ్యంలో ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. రవితేజకు జోడీగా అదితీరావ్ హైదరీ కనిపించనున్నారు. సిద్ధార్థ్ సరసన మరో హీరోయిన్ ఎంపిక చేయాల్సి ఉంది. ఈ సినిమా చిత్రీకరణ అక్టోబర్‌లో ప్రారంభం కానుందని అంటున్నారు. నిజానికి సిద్దార్థ్ రెండేళ్ళ క్రితం గృహం అనే తెలుగు సినిమా చేశారు, ఆ సినిమా పెద్దగ ఆడక పోవడంతో ఆయన పూర్తిగా తమిళ్ కే పరిమితం అయిపోయారు. ఇప్పుడు అజయ్ భూపతి పుణ్యమా అని తెలుగులో మరో క్రేజీ ప్రాజెక్ట్ చేస్త్తున్నారు.