English   

మహేష్ మీద కామెంట్స్...పూరీని ఆడేసుకుంటున్న ఫ్యాన్స్ !

Mahesh
2019-07-20 12:02:12

ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా దర్శకుడు పూరి జగన్నాధ్ తాజాగా తెరకెక్కించిన చిత్రం ఇస్మార్ట్ శంకర్. ఈ సినిమా మొన్న గురువారం విడుదలై మొదటి ఆట నుండే హిట్ టాక్ తెచ్చుకుంది. నిజానికి టెంపర్ తర్వాత హిట్ లేని పూరికి సినిమా అవకాశం ఇవ్వడానికి పెద్ద హీరోలు కానీ నిర్మాతలు కానీ ముందుకు రాకపోవడంతో ఆయన సొంతగా నిర్మాణ సంస్థ ఏర్పాటు చేసుకుని మరీ సినిమాలు చేస్తూ వెళ్తున్నాడు. ఈ క్రమంలో రామ్ ముందుకు వచ్చి పూరి కి సపోర్ట్ ఇచ్చి ఇద్దరూ కలిసి మంచి హిట్ కొట్టాడు. అయితే ఈ హిట్ ఇచ్చిన ఊపుతో ఉన్న పూరీ ప్రమోషన్స్ లో భాగంగా మహేష్ మీద చేసిన కామెంట్స్ మహేష్ ఫ్యాన్స్ ను ఆగ్రహానికి గురి చేస్తున్నాయి. ఒక యూ ట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో యాంకర్ మహేష్ బాబుతో 'జనగణమన' ఎప్పుడుంటుంది అంటూ ప్రశ్నించగా ఆ విషయాన్ని ఉద్దేశించి ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. 'మహేష్ బాబుతో రెండు హిట్ సినిమాలు తీశానని ఆ అభిమానంతోనే ఆయన అభిమానులు మరో సినిమా చేయమని అడుగుతున్నారని పూరి చెప్పుకొచ్చాడు. అయితే హిట్లలో ఉంటేనే మహేష్ తనతో సినిమా చేస్తాడని పూరీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అలా పూరి చేసిన వ్యాఖ్యలపై సూపర్ స్టార్ ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు. గతంలో పూరి వరుసగా మూడు ఫ్లాప్ లు తీసినా కూడా పోకిరి ఛాన్స్ ఇచ్చాడని, ఆ తర్వాత కూడా పెద్దగా సక్సెస్ లేకుండా ఉన్న పూరికి బిజినెస్మాన్ ఇచ్చాడని అలాంటి మహేష్ గురించి పూరి ఇలాంటి నోటిదురద వ్యాఖ్యలు ఎలా చేస్తాడంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. 

More Related Stories