English   

నాగార్జున ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత !

Nagarjuna
2019-07-20 13:38:41

మరోకొద్ది గంటల్లో బిగ్ బాస్ షో మొదలు కానున్న క్రమంలో నాగార్జున ఇంటిని ముట్టడించారు ఓయూ విద్యార్ధులు. శ్వేతా రెడ్డి, గాయ‌త్రి గుప్తాలు పెట్టిన లైంగిక వేధింపుల కేసులకి మద్దతు పలుకుతున్న వారు బంజారాహిల్స్ లోని ఆయన ఇంటిని ముట్టడించారు. ఓయూ జేఏసీ నాయకుడు కందుల మధు ఆధ్వర్యంలో బిగ్‌బాస్‌కు వ్యతిరేకంగా ఓయూ విద్యార్థులు నాగార్జున ఇంటి బయట ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. అయితే  జేఏసీ సభ్యులు బిగ్ బాస్-3 కార్యక్రమాన్ని వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాక ఈ కార్యక్రమం హోస్ట్ గా నాగార్జున తప్పుకోవాలని వారు కోరుతున్నారు. రాడి సాధించుకున్న తెలంగాణలో మహిళలను కించపరిచే, వేధించే బిగ్‌ బాస్ లాంటి షోలను వ్యతిరేకిస్తున్నట్టు ఓయూ విద్యార్థులు పేర్కొంటున్నారు. రెండు మూడు రోజుల క్రితం కూడా ఇంటిని ముట్టడించడానికి ప్రయత్నాలు చేయడంతో ఆయన ఇంటి చుట్టూ పోలీసులు పెద్ద ఎత్తున మొహరించారు. ఈ నేపధ్యంలో ఈరోజు విద్యార్ధులను అదుపులోకి తీసుకుని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

More Related Stories