జబర్దస్త్ నటుడు వినోద్ మీద మర్డర్ అటెంప్ట్

జబర్దస్త్‌లో లేడీ గెటప్‌లు వేస్తూ ఫేమస్ అయిన వినోద్ అలియాస్ వినోదిని మీద హత్యాయత్నం జరిగింది. కాచిగూడ పోలీసుస్టేషన్ పరిధిలో వినోద్ మీద గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని కేసు నమోదయింది. మొహంపై పిడిగుద్దులు గుద్దడంతో వినోద్ కి తీవ్ర గాయాలయ్యాయి. అయితే ఇంటి ఓనరే తన మీద హత్యాయత్నం చేశాడని వినోద్ పోలీసులకి ఫిర్యాదు చేశాడు. వినోద్ ఫిర్యాదు మేరకు అతని ఇంటి ఓనర్ మీద కాచిగూడ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే వినోద్ మీద ఇంటి ఓనర్ దాడి ఎందుకు చేశారు ? ఈ దాడి ఒక్కరే చేసారా అనే విషయాలు మాత్రం బయటకు రాలేదు. గతంలో కూడా వినోద్ ఒకసారి వార్తల్లోకి ఎక్కాడు. తన మేనకోడలితో బలవంతంగా కుటుంబ సభ్యులు పెళ్లి చేయడానికి ప్రయత్నించగా వినోద్ చేయి కోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. అయితే ఇంటి ఓనర్ దాడి చేశారు అంటే ఇదేదో ఆర్ధిక సంబందమైన విషయమే అని భావిస్తున్నారు. పోలీసులు ఇంటి యజమానికి అరెస్ట్ చేసి, విచరాణ చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.