English   

రెండో రోజూ వసూళ్లతో ఇస్మార్ట్ గా రచ్చ చేసిన శంకర్ !

iSmart Shankar
2019-07-20 16:58:00

ఇన్నాళ్ళు హిట్ లేక ఆకలితో ఎదురు చూసిన పూరీకి బంపర్ హిట్ దొరికేసింది. యంగ్ ఎన‌ర్జిటిక్ హీరో రామ్ తో పూరి తెరకెక్కించిన ఇస్మార్ట్‌ శంకర్ బాక్సాఫీస్ వద్ద రచ్చ చేస్తున్నాడు. వ‌రుస ప్లాపుల్లో ఉన్న ఈ ఇద్ద‌రి కాంబినేష‌న్లో వ‌చ్చిన సినిమా మీద విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. అంచనాలకు మించి బొమ్మ ఉండడంతో ఈ సినిమా భారీ వ‌సూళ్లు రాబ‌డుతోంది. రామ్ కెరీర్లోనే ఎన్నడూ లేని విధంగా ఇస్మార్ట్ శంక‌ర్‌కు తొలి రోజు రూ.8 కోట్ల షేర్ వ‌చ్చింది. ఇక రెండో రోజు కూడా అదే దూకుడు కంటిన్యూ చేసి రెండు తెలుగు రాష్ట్రాల్లోనే రూ. 4 కోట్ల  వసూళ్లతో పూరీ స్టామినా తగ్గలేదని చెబుతోంది. ఈ వారం ఇంకా చెప్పుకోదగ్గ సినిమాలేవీ లేకపోవడంతో ఇప్పటికే కొన్ని ఏరియాలలో డిస్ట్రిబ్యూటర్ లు లాభాల బాట పట్టరని సమాచారం. ఈ సినిమాను రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.18 కోట్ల‌ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఫ‌స్ట్ వీకెండ్ కంప్లీట్ అయ్యే స‌రికే బ్రేక్ ఈవెన్ దాటేయ‌వ‌చ్చ‌ని ట్రేడ్ వ‌ర్గాలు లెక్క‌లు వేస్తున్నాయి. ఇక రెండ్రోజుల కలెక్షన్స్ చూస్తే, ఇస్మార్ట్ శంక‌ర్ 2 డేస్‌ క‌లెక్ష‌న్స్ (రూ.కోట్ల‌లో):
నైజాం 5.04 (1.92)
సీడెడ్ 1.90 (0.70)
వైజాగ్ 1.38 (0.52)
గుంటూరు 0.81(0.24)
ఈస్ట్ 0.79 (0.29)
వెస్ట్ 0.60 (0.21)
కృష్ణ 0.78 (0.26)
నెల్లూరు 0.45 (0.15)

More Related Stories