English   

నటి హేమకి శ్వేతారెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ !

hema
2019-07-20 19:44:40

తెలుగులో రెండు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకొని మూడో సీజన్ బిగ్ బాస్ కి సిద్దం అయ్యింది. అయితే ఈ షో మొదలు కాక ముందు నుండే ఈ షోని రకరకాల వివాదాలు చుట్టుముడుతూనే ఉన్నాయి. ఈ షో మీద ఇప్పటికే యాంకర్ శ్వేతా రెడ్డి, నటి గాయిత్రి గుప్తా పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఈ షో ప్రసారాన్ని నిలిపి వేయాలని కోరుతూ తెలంగాణ హై కోర్టులో దర్శక నిర్మాత కేతిరెడ్డి పిల్‌ కూడా వేశారు. అయితే తాజాగా ఈ రియాల్టీ షోలో పాల్గొనబోతున్న నటి హేమ ఈ విషయాల మీద స్పందించారు. తన సొంతఊరికి వెళ్ళిన ఆమెను అక్కడి లోకల్ మీడియా పలకరించి అన్ని విషయాలతో పాటు ఈ విషయం కూడా అడిగారు. దానికి ఆమె క్యాస్టింగ్‌ కౌచ్‌ లాంటివి ఈ షోలో ఉండవని ఉంటే నాగార్జున లాంటి పెద్ద హీరో హోస్ట్‌గా చేయడానికి ఎందుకు ఒప్పకుంటారని ప్రశ్నించారు ఎదురు ప్రశ్నించింది హేమ. అంతే కాక అలాంటివి ఉంటే ఇన్ని రోజులు ఊరుకుని ఇప్పుడు ఎందుకు రచ్చ చేస్తున్నారు అన్నట్టు ప్రశ్నించింది. తాజాగా ఆ వ్యాఖ్యల మీద యాంకర్ శ్వేతారెడ్డి ఘాటుగా స్పందించింది. మీరు పుష్కరాల సమయంలో స్నానం చేస్తున్నప్పుడు తడిచిన బట్టలతో స్నానం చేస్తున్న వీడియోలు అప్లోడ్ చేసిన వారి మీద కంప్లైంట్ చేయడానికి పది రోజులు పట్టిందని లాజిక్ ప్రశ్నించింది. అలాగే బిగ్ బాస్ లో జరుగుతున్న వేధింపులు గురించి మేము మాట్లాడుతుంటే. మీరు పబ్లిసిటీ కోసం కేసులు పెట్టారని మాపై నిందలు వేస్తారా అని శ్వేతారెడ్డి ప్రశ్నించింది. ఇండస్ట్రీలో ఓ పొజిషన్ లో ఉన్నమీరు 'మా' ఎన్నికల సందర్భంగా స్టేజ్ మీద ఎలాకొట్టుకున్నారో ప్రజలంతా చూశారని ఆమె ఒక వీడియో రిలీజ్ చేసింది.

More Related Stories