English   

అరేయ్ జగన్ గా...బాడకావ్...పూరీని బూతులు తిట్టిన వర్మ !

rgv
2019-07-21 08:00:35

చాన్నాళ్ళ తర్వాత పూరీ జగన్నాధ్ హిట్ కొట్టాడు, ఈ సినిమా హిట్ ని ఆయన కంటే ఆయన గురువు రామ్ గోపాల్ వర్మనే ఈ హిట్ ని ఎక్కువగా సెలెబ్రేట్ చేసుకుంటున్నాడు. తనకు  మాత్రమే సాధ్యమైన రచ్చతో ఫ్రీ పబ్లిసిటీ చేస్తున్నాడు. హైదరాబాద్ నడిబొడ్డున ట్రిపుల్ రైడింగ్ చేసి మరీ చేసి పోలీసులెక్కడా అని ట్వీట్ చేసి వాళ్లతో ఫైన్ వేయించుకోవడమే కాక అక్కడే తన మరో ఇద్దరు శిష్యులతో కలిసి సినిమా చూసి రచ్చ చేసాడు. ఇక సినిమా అయిపొయిన తర్వాత తన శిష్యుడు పూరీని బూతులు తిట్టుకుంటూ ట్వీట్ చేశాడు. అరేయ్ జగన్‌గా ఇట్టాంటి బ్లాక్‌బస్టర్‌లు తీసే దమ్ముండి కూడా ఎందుకు తీయవురా బాడ్‌కావ్? అని పూరీ జగన్నాథ్‌ను ఉద్దేశించి వర్మ ట్వీట్ చేశాడు. దీనికి ఇస్మార్ట్ హీరో రామ్, హీరోయిన్లు నభా నటేష్, నిధి అగర్వాల్‌లతోపాటు చార్మిని సైతం ట్యాగ్ చేశాడు. దీనికి పూరీ కంటే ముందు స్పందించిన చార్మి సార్ పూరీకి నేను చాలా సార్లు చెప్పాను. ఆయన ఫ్యాన్స్ ఫుల్ మీల్స్ కోరుకుంటున్నారు. జగన్ బలం ఎంటర్‌టైన్మెంట్ ఇస్మార్ట్ శంకర్ దాన్ని నిరూపించింది. ఇప్పుడు ఇంకా తిట్టండని అలా తిడితే అన్నా ఇలాగే హిట్లు కొడతాడని ఆర్జీవీ ట్వీట్‌కి చార్మి బదులిచ్చింది. ఇక వర్మ బూతు ప్రేమకు స్పందించిన పూరీ జగన్నాథ్ సార్ మీ తిట్లకు నేను అర్హుడినే, లవ్యూ అంటూ ఆయన కూడా గురువు మీద ప్రేమను చాటుకున్నాడు.

More Related Stories