English   

రామ్ చ‌ర‌ణ్ కోసం అనుకుంటే ఇప్పుడు నాగ‌చైత‌న్య వ‌చ్చాడే..

nag
2019-07-21 08:15:42

ఇండస్ట్రీలో ఓ హీరో కోసం అనుకున్న సినిమాలో మరో హీరో తీసుకోవడం అనేది చాలా కామ‌న్. కొన్నిసార్లు డేట్లు అడ్జెస్ట్ చేయలేక పోవడం..  మరికొన్ని సార్లు కథ నచ్చక పోవడంతో అది ఇతర హీరోల చేతుల్లోకి వెళ్తుంది. ఇప్పుడు రామ్ చరణ్ కోసం ఒక దర్శకుడు రాసుకున్న కథ కూడా ఇలాగే నాగచైతన్య వెళ్లింద‌ని తెలుస్తోంది. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్.. ఎక్స్ ప్రెస్ రాజా లాంటి సినిమాలతో తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు మేర్లపాక గాంధీ. అప్పట్లో శర్వానంద్ తో తెరకెక్కించిన ఎక్స్ ప్రెస్ రాజా విజయం సాధించగానే రామ్ చరణ్ కోసం ఒక థ్రిల్ల‌ర్ క‌థ‌ రాసుకున్నాడు మేర్లపాక గాంధీ. ఇది రామ్ చరణ్ కు కూడా నచ్చడంతో యు.వి.క్రియేషన్స్ బ్యానర్ తెరకెక్కించాలని అనుకున్నారు. అయితే అనుకోని కారణాలతో ఆ సినిమా ఆగిపోయింది. ఆ తర్వాత నాని హీరోగా తెరకెక్కిన కృష్ణార్జున యుద్ధం ఫ్లాప్ కావడంతో మేర్లపాక గాంధీ కనిపించకుండా పోయాడు. ఇక ఇన్ని రోజుల తర్వాత రామ్ చరణ్ కోసం రాసుకున్న స్టోరీ ఇప్పుడు నాగచైతన్యకు ఆయన మ‌ళ్లించాడని తెలుస్తుంది. ఈ కథ నచ్చడంతో నాగచైతన్య కూడా గాంధీ దర్శకత్వంలో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నాడు. అయితే ఆయ‌న కోసం మరో ఏడాది వరకు వేచి చూడక తప్పదు. ఎందుకంటే ప్రస్తుతం వెంకీ మామ సినిమాతో పాటు శేఖర్ కమ్ముల సినిమాకు కూడా కమిట్ అయ్యాడు నాగచైతన్య. ఈ సినిమాలు పూర్తయ్యే వరకు కనీసం మరో ఏడాది పడుతుంది. ఆ తర్వాతే మేర్లపాక గాంధీ నాగచైతన్య సినిమా మొదలు కానుంది. మరి ఈ  ఈ సినిమాతో గాంధీ ఫామ్ లోకి వ‌స్తాడో లేదో చూడాలి.

More Related Stories