English   

నేను డేటింగ్ లో ఉన్నా...మోసం చేస్తే చంపేస్తా....నటి సంచలనం !

sonak
2019-07-21 08:32:40

నేటి కాలంలో డేటింగ్ లు ఆ తర్వాత బ్రేకింగ్ లు కామన్ అయిపోయాయి. నిజానికి సామాన్యుల విషయం పక్కన పెడితే సెలబ్రిటీల విషయంలో ఇది ఇంకా కామన్ అయిపొయింది. అయితే ఒక హీరో కానీ హీరోయిన్ కానీ ఎవరితో అయినా కాస్త క్లోజ్ గా ఉన్నా ఆ విషయం పెద్ద సంచలనం అయిపోతుంది. కానీ తను ఒక ఓ సెలబ్రిటీతో డేటింగ్‌ చేసినా దాన్ని ఈ ప్రపంచం కనిపెట్టలేకపోయిందని సంచలన వ్యాఖ్యలు చేసింది బాలీవుడ్‌ నటి సోనాక్షి సిన్హా. శతృజ్ఞసిన్హా వారసురాలిగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి తొమ్మిదేళ్లు కావొస్తున్నా ఆమె ఎప్పుడూ ఇలాంటి విషయాలు మాట్లాడలేదు. కానీ తాజాగా 'ఖందాని షఫఖాన' చిత్రంలో నటిస్తోన్న ఆమె ఆ సినిమా ప్రమోషన్‌ పనుల్లో భాగంగా తొలిసారి తన వ్యక్తిగత విషయాలను వెల్లడించింది. తాను రహస్యంగా ఓ సెలబ్రిటీతో డేటింగ్‌లో ఉన్నట్టు చెప్పింది. కానీ అతనెవరో ఇప్పటి వరకూ ఎవరికీ తెలియదని పేర్కొంది. ఈ సందర్భంలో కూడా అతని పేరును బయటకు చెప్పలేదు. అలాగే ఆమె తన పెళ్లి గురించి మాట్లాడుతూ మంచి గుణవంతుడితో డేటింగ్‌ చేయమంటున్నారు. కానీ దురదృష్టవశాత్తు బాలీవుడ్‌లో అటువంటి వారు ఒక్కరూ లేరని చెప్పుకొచ్చింది. అలాగే తనను ప్రేమించే వ్యక్తి మోసం చేస్తే ఆ మరుసటి రోజు బతికుండడని కూడా సంచలన వ్యాఖ్యానించింది ఆమె. నిజానికి సోనాక్షి బంటీ సజ్‌దేతో ప్రేమలో ఉన్నారని బాలీవుడ్‌ ఒకప్పుడు కోడై కూసింది. ఈ వదంతులకు తగ్గట్టే వీరిద్దరూ కలిసి పార్టీలకు వెళ్లడం, బహిరంగంగా తిరుగుతూ మీడియా కంటపడ్డారు. ఈ నేపథ్యంలో త్వరలోనే వీరిద్దరూ ఒక ఇంటివారు కాబోతున్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే వాటిలో నిజం లేదని సోనాక్షి అప్పట్లో క్లారిటీ ఇచ్చింది. 

More Related Stories