సరికొత్తగా అనుష్క నిశ్శబ్ధం పోస్టర్

భాగమతి సినిమా తరువాత చాలా గ్యాప్ తీసుకుని మరీ అనుష్క శెట్టి నటిస్తున్న తాజా సినిమా సైలెన్స్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అమెరికాలో శరవేగంగా జరుగుతోంది. అమెరికాలో షూట్ చేసుకుంటున్న ఈ మూవీని ఈ ఏడాది డిసెంబర్ లో రిలీజ్ చేయాలని భావిస్తున్నట్టు చెబుతున్నారు. అయితే ఈ విషయం మీద అధికారిక ప్రకటనలు ఏవీ లేవు కానీ అనుష్క సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి సక్సెస్ ఫుల్ గా 14 ఏళ్లు పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా ‘నిశ్శబ్ధం’ ఆమెకి శుభాకాంక్షలు తెలిపుతూ.. ఈ సినిమా టైటిల్ పోస్టర్ను విడుదల చేశారు. ఈ పోస్టర్లో అనుష్క చేతులను కలర్ ఫుల్ గా చేసి వైవిధ్యంగా చూపించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థతో కలిసి కోన ఫిల్మ్ కార్పొరేషన్ నిర్మిస్తోన్న చిత్రానికి మంత్ మధుకర్ దర్శకత్వం వహిస్తున్నారు. థ్రిల్లర్ జానర్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రముఖ నటుడు మాధవన్ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. హాలీవుడ్ నటుడు మైఖేల్ మ్యాడ్సన్ మరో కీలక పాత్రలో నటించనున్నారు. కోనవెంకట్, టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా నేపధ్యం అంతా అమెరికాలో ఉండనుండడంతో ఎక్కువ భాగం షూటింగ్ కూడా అక్కేడే జరుపుకోనుంది. ఈ సినిమాను తమిళ, హిందీ, ఇంగ్లీష్ ఒకేసారి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.