జూనియర్ ఎన్టీఆర్ కు జగన్ కీలక బాధ్యతలు.. షాక్ లో తెలుగు తమ్ముళ్లు..

వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏపీలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఆయన తను అనుకున్నది అనుకున్నట్లుగా అమలు పరుస్తున్నాడు. ఎవరేం అనుకుంటారో.. ఏం చేస్తే ఏం విమర్శలు వస్తాయో అనేది అస్సలు పట్టించుకోవడం లేదు జగన్. ఈ క్రమంలోనే ఇప్పుడు ఏపీలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడానికి.. అభివృద్ది చేయడానికి పూనుకున్నాడు జగన్. దీనికోసమే ఇప్పుడు జూనియర్ వైపు జగన్ చూపులు వెళ్తున్నాయి. ఏపీ కొత్త పర్యాటక బ్రాండ్ అంబాసిడర్ గా ఎన్టీఆర్ పేరు పరిశీలనకు వచ్చింది. ఇదే ఇప్పుడు సంచలనంగా మారుతుంది. తెలుగుదేశం పార్టీలో ఉన్న జూనియర్.. జగన్ కోసం బ్రాండింగ్ చేస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది. ఈయనతో పాటు సింధు పేరు కూడా పరిశీలనలో ఉన్నా అంతా జూనియర్ వైపు ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తుంది. మరోవైపు మంత్రి కొడాలి నానితో పాటు జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నె శ్రీనివాసరావు కూడా వైసీపీ నేతలే కావడంతో ఇప్పుడు జూనియర్ కు ఈ బాధ్యతలు వచ్చేలా కనిపిస్తున్నాయి. అదే సమయంలో అంతర్జాతీయ షట్లర్ గా ఘనవిజయాలు అందుకుని ఏపీ పేరు ఇనువడింపచేసిన సింధు పేరు కూడా బలంగానే వినిపిస్తుంది. చివరికి ఈ ఇద్దర్లో ఎవరికి ఈ అవకాశం వస్తుందా అనేది ఆసక్తికరంగా మారిందిప్పుడు. దేశంలోనే రెండో పొడవైన తీరప్రాంతంతో పాటు పురాతన కట్టడాలు, ఆలయాలు, ఇతర పర్యాటక స్ధలాలు ఏపీలో అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు సద్వినియోగం చేసుకుని పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసి కమర్షియల్ గా కూడా లాభపడాలని జగన్ ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఒకవేళ నిజంగానే ఇప్పుడు జూనియర్ కానీ ఒప్పుకుంటే ఆయనతో మరిన్ని అద్భుతమైన కార్యక్రమాలు చేయాలని పర్యాటక శాఖా మంత్రి అవంతి శ్రీనివాస్ చాలా ప్లాన్స్ సిద్ధం చేసుకుంటున్నాడని తెలుస్తుంది. మరి చూడాలిక.. చివరికి ఏం జరుగుతుందో..?