English   

ఇండ‌స్ట్రీలో కృత‌జ్ఞ‌త ఉండ‌దు.. పూరీ జ‌గ‌న్నాథ్ సంచ‌ల‌నం..

puri
2019-07-21 19:59:33

కష్టాల్లో ఉన్నప్పుడు పక్కన లేకపోతే ఆత్మీయులు ఉండి ఏం లాభం.. అలాంటి నలుగురు స్నేహితులు లేనప్పుడు ఎంత సంపాదించి మాత్రం ఏం ప్ర‌యోజ‌నం అంటున్నాడు పూరీ జ‌గ‌న్నాథ్. ఇదే విషయాన్ని ఇప్పుడు సూటిగా అడిగేశాడు ఈయ‌న‌. ఇండస్ట్రీలో ఫ్లాపులు వచ్చినప్పుడు మీకు ఎవరు తోడుగా ఉన్నారని యాంకర్ అడిగిన ప్రశ్నకు ఎవరూ లేరు అంటూ ఠక్కున సమాధానం చెప్పాడు పూరి. అదేంటి మీరు ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు తీశారు.. ఎంతో మంది హీరోలకు లైఫ్ ఇచ్చారు.. నిర్మాతలకు కూడా డబ్బులు తీసుకొచ్చి పెట్టారు కదా.. అలాంటి మిమ్మల్ని ఎలా వదిలేసారు అంటే ఇక్కడ ఎవరికి జాలి దయ కరుణ ఉండవు.. ఇక్కడ మనుషుల్ని మనుషుల్లాగా ట్రీట్ చేయడం ఎప్పుడో మానేశారని చెప్పాడు పూరి జగన్నాథ్. తన విషయంలో కూడా ఇదే జరిగిందని.. ఇండస్ట్రీలో హిట్స్ ఉన్నప్పుడు మాత్రమే విలువ ఉంటుందని చెప్పాడు పూరి జగన్నాథ్. ఉదాహరణకు మహేష్ బాబుని చూపించాడు ఈయన. గతంలో పోకిరి, బిజినెస్ మేన్ లాంటి రెండు మంచి సినిమాలు మహేష్ బాబుకు ఇచ్చాన‌ని కానీ జనగణమన సినిమా విషయంలో ఇప్పటికీ ఆయన కోసం వేచి చూస్తున్నాను అంటున్నాడు ఈ దర్శకుడు. ఇక్కడ కేవలం హిట్స్ ఉన్నప్పుడు మాత్రమే మనుషులకు విలువ ఉంటుందని.. ఫ్లాప్ వస్తే కనీసం పట్టించుకోరు అంటున్నాడు. మహేష్ బాబుతో సినిమా ఆగిపోవడానికి కూడా ప్రత్యేకంగా కారణం అవసరం లేదు.. తన ఫ్లాట్లో ఉండటమే అని ఇన్ డైరెక్ట్ గా చెప్పాడు పూరీ. గతంలో వాళ్లకు ఏం చేశాం ఎంత చేసాం అనేది ఇక్కడ గుర్తుంచుకోర‌ని.. ఆ కృతజ్ఞత అనే మాట అసలు ఇండస్ట్రీలో వినిపించదు అంటున్నాడు పూరీ జ‌గ‌న్నాథ్.

More Related Stories