English   

సాయి పల్లవి.. సౌందర్య కంటే గొప్పది అయితే కాదు కదా..?

sai
2019-07-21 21:50:33

ఇప్పుడు ఈ అనుమానం ఎందుకొచ్చింది అనుకుంటున్నారా..? ఆమె చేస్తున్న ప‌నులు చూస్తుంటే ఇదే అనిపిస్తుంది మ‌రి. ఒక‌టి రెండు అంటే ఏమో అనుకోవ‌చ్చు కానీ ఇప్ప‌టికే మూడు నాలుగు సినిమాలు వ‌దిలేసుకుంది ఈ భామ‌. ఇదే ఇప్పుడు ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్ అయిపోయింది. అస‌లెందుకు సాయిపల్ల‌వి ఇలా చేస్తుంద‌ని అభిమానులు కూడా సందిగ్ధంలో ప‌డుతున్నారు. ఇంత‌కీ విష‌యం ఏంటంటే స‌రిలేరు నీకెవ్వ‌రుతో పాటు మ‌రిన్ని పెద్ద సినిమాలు కూడా ముందు సాయిప‌ల్ల‌విని అనుకుని.. ఆ త‌ర్వాత వేరే హీరోయిన్ల‌ను తీసుకొచ్చారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ఆయా సినిమాల్లో ఆమె త‌ప్పుకోడానికి క‌థ‌లు న‌చ్చ‌క‌పోవ‌డం కాదు.. ఎక్స్ పోజింగ్ కు ఒప్పుకోక‌పోవ‌డ‌మే. డియ‌ర్ కామ్రేడ్, స‌రిలేరు నీకెవ్వ‌రు రెండు సినిమాల్లోనూ సాయిప‌ల్ల‌వి వదిలేసుకున్న పాత్ర‌లే ఇప్పుడు ర‌ష్మిక‌కు వ‌చ్చాయి. ఆమె ప్ర‌తీ సినిమాలో కూడా అందం ప్ల‌స్ అభిన‌యంతో ఫ్యాన్స్ ను ఫిదా చేస్తుంది. ముఖ్యంగా లిప్ లాక్ స‌న్నివేశాల‌కు కూడా ఈమె ఓకే అనేస్తుంది. దాంతో ద‌ర్శ‌క నిర్మాత‌లు ఈ క‌న్న‌డ బ్యూటీ వెంట ప‌డుతున్నారు. ఇదిలా ఉంటే ఒక‌ప్పుడు సౌంద‌ర్య కూడా అవ‌కాశాల కోసం కాస్త ప‌ద్ద‌తులు తీసి ప‌క్క‌న‌బెట్టింది. కొన్ని సినిమాల్లో అందాల‌ను ఓ మోతాదులో ఆర‌బోసింది. కానీ సాయిప‌ల్ల‌వి మాత్రం పూర్తిగా మ‌డి క‌ట్టుకుని కూర్చుంటుంది. ఇలా చేస్తే ఇంకొన్ని రోజుల్లో క‌చ్చితంగా కెరీర్ ఎండ్ కార్డ్ ప‌డ‌టం ఖాయం అంటున్నారు విశ్లేష‌కులు. అయినా స‌రే తాను అనుకున్నదే చేస్తానంటుంది ఈ ముద్దుగుమ్మ‌. మొత్తానికి ఇది చూసిన ఫ్యాన్స్ కూడా ఒకింత ఫీల్ అవుతున్నారు. సౌంద‌ర్య అంత గొప్ప న‌టి అయితే సాయిప‌ల్ల‌వి కాదు క‌దా.. కాస్త న‌డుము వ‌ర‌కు అయినా చూపిస్తే వ‌చ్చే న‌ష్ట‌మేంటి అంటున్నారు వాళ్లు. అయితే ఆమె మాత్రం ప‌ట్టిన‌ప‌ట్టు వ‌ద‌ల‌నంటుంది. మ‌రి చూడాలిక‌.. ఈ ప‌ద్ద‌తుల‌తో ప‌ల్ల‌వి ప్ర‌యాణం ఎంత దూరం వెళ్ల‌నుందో..?

More Related Stories